Site icon Prime9

Banks : సమ్మె బాట పట్టనున్న బ్యాంకులు.. ఎప్పటి నుంచి అంటే ??

banks strike from december 4th to 11 on all over india

banks strike from december 4th to 11 on all over india

Banks : సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు నిత్యం బ్యాంకింగ్ రంగంపై ఆధారపడుతూనే ఉంటారు. రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా బ్యాంకింగ్ సేవలను నిత్యం వినియోగిస్తూ ఉండడం సాధారణంగా మారిపోయింది. కాగా కరోనా తర్వాత డిజిటల్ పేమెంట్స్ వినియోగం, బ్యాంకింగ్ సేవలను మరింత ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఊహించని విధంగా బ్యాంకులు అందరికీ షాక్ ఇవ్వనున్నాయి.

డిసెంబర్‌ నెలలో చాలా రోజుల పాటు వివిధ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. డిసెంబరు 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాంకుల్లో తగినంత మంది శాశ్వత సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవలకు స్వస్తి పలకాలన్నది బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్ చేస్తున్నాయి. తాత్కాలిక ఉద్యోగుల వల్ల బ్యాంకు ఖాతాదారుల కీలక సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని బ్యాంకు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ప్రజలు గమనించి ముందుగానే బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోగలరు.

డిసెంబరు 4 నుంచి 11 వరకు సమ్మె.. 

డిసెంబరు 4న – ఎస్బీఐ, పీఎన్బీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సమ్మె చేయనున్నాయి.

డిసెంబరు 5న – బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా

డిసెంబరు 6న – సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు.

డిసెంబరు 7న – యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్

డిసెంబరు 8న – యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

డిసెంబర్ 9 & 10- బ్యాంకులకు రెండో శనివారం & ఆదివారం సెలవులు

డిసెంబరు 11న – పలు ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.

Exit mobile version