Site icon Prime9

ATM Charges: ఖాతాదారులకు బిగ్ షాక్.. ఏటీఎం ఛార్జీలు పెంపు… ఇలా చేస్తే బాదుడే!

ATM withdrawals to cost more from May 1: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఏటీఎం ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు పెరిగిన ఏటీఎం ఛార్జీలు ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కాగా, ప్రస్తుతం ప్రతి నెలా ఇతర బ్యాంకు ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో 5 సార్లు ఉచితంగా డ్రా చేసుకుంటుండగా.. నాన్ మెట్రో ప్రాంతాల్లో 3 సార్లు నగదును డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే తాజాగా, ఏటీఎం ఛార్జీల పెంపుతో ఈ పరిధి దాటితే నగదు డ్రా చేసుకునేందుకు రూ.17 నుంచి రూ.19 వరకు ఛార్జీలు.. బ్యాలెన్స్ చెకింగ్ కోసం రూ. 6 నుంచి రూ.7 వరకు చార్జీలు పెరగనున్నాయి.

 

ఇదిలా ఉండగా, ఏటీఎం సేవలను ఉపయోగించుకునేందుకు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు చెల్లించే ఛార్జీని ఏటీఎం ఇంర్ ఛేంజ్ ఫీజుగా పరిగణిస్తారు. అయితే, దీనిని లావాదేవీల్లో 1శాతంగా ఉంటుంది. గతంలో 2021 జూన్‌లో ఆర్బీఐ ఈ ఇంటర్ ఛేంజ్ ఫీజులను సవరించగా.. తాజాగా, మరోసారి పెంచింది. ఇందులో భాగంగానే ఆర్థిక లావాదేవీలకు రూ.2, ఆర్థికేతర లావాదేవీలకు రూ.1 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

 

కాగా, ఇంటర్ ఛేంజ్ ఫీజుల పెంపుదలకు సంబంధించి అనుమతించే నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే బ్యాంకులతో ఇతర వాటాదారులకు సమాచారం అందించినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఇంటర్ ఛేంజ్ ఫీజులతో నెట్టుకురావడం కష్టతరంగా ఉందని, ఈ ఆర్థిక నష్టాన్ని భరించేందుకు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల రిక్వెస్ట్ మేరకు ఇంటర్ ఛేంజ్ ఫీజులు పెంచినట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా ఏటీఎం ఛార్జీల పెంపుతో తక్కువ నెట్ వర్క్ ఉన్న బ్యాంకులపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version
Skip to toolbar