Site icon Prime9

Samsung Mobile Business: 2022 ప్రథమార్థంలో 20% వృద్ధిని నమోదు చేసిన శామ్ సంగ్ మొబైల్స్

Samsung Mobile Business: భారతదేశంలో 2022 ప్రథమార్థంలో శామ్ సంగ్ మొబైల్ వ్యాపారం 20% వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ సీనియర్ డైరెక్టర్ మరియు మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ తెలిపారు. శామ్ సంగ్ 2022 ప్రథమార్ధంలో23% మార్కెట్ వాటాను పొందింది. 17% వాటాతో జియోమి రెండవ స్థానంలో వుంది. బడ్జెట్ మరియు మధ్య-శ్రేణి మార్కెట్‌గా రూపొందుతున్న రూ.10,000-40,000 విభాగంలో శామ్ సంగ్ వాటా 26.9% వద్ద ఉంది.శామ్ సంగ్ ఇప్పుడు రెండు కొత్త M-సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌లు – M13 మరియు M13 5G లాంచర్‌తో తన వాటాను మరింత కన్సాలిడేట్ చేయాలని భావిస్తోంది. M13 5Gశామ్‌సంగ్ నుండి రూ. 15,000 లోపు మొదటి 5G ఫోన్ అవుతుందని భావిస్తున్నారు.

భారతదేశంలో తమకు M-సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌లను కలిగివున్న 42 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారని శామ్ సంగ్ తెలిపింది. 2019లో మొదటిసారి ప్రారంభించినప్పటి నుండి ఈ సిరీస్ కంపెనీకి $1 బిలియన్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించిందని శామ్ సంగ్ పేర్కొంది.

Exit mobile version