Yamaha 125cc scooter: యమహా మోటార్ ఇండియా నుంచి మరో సరికొత్త స్కూటర్లు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. ఆహ్లాదకరమైన, ఫీచర్ ప్యాక్డ్ 2023 వెర్షన్ 125 సీసీ స్కూటర్ శ్రేణిని తీసుకొచ్చింది యమహా.
వీటిలో ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ , రే జెడ్ ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, రే జెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ ఉన్నాయి.
కార్బన్ కారకాలను తగ్గించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ 2023 వెర్షన్ యయహా 125 సీసీ హైబ్రిడ్ స్కూటర్‌లో ఈ 20 ఫ్యూయల్ ప్రమాణాలతో కూడిన ఇంజిన్‌ను
ఉపయోగించారు. ఈ నూతన ఇంజిన్ ఓబీడీ2 ప్రమాణాలను కూడా కలిగి ఉంది.
125 సీసీ హైబ్రిడ్ స్కూటర్ శ్రేణిలో యమహా విప్లవాత్మక బ్లూ టూత్ ఆధారిత వై- కనెక్ట్ యాప్ కూడా ఉంది.
టూ వీలర్స్ కు నూతన ప్రమాణాలను నిర్ధేశిస్తూ యమహా కనెక్ట్ యాప్ పలు సౌకర్యవంతమైన ఫీచర్లను ఇస్తోంది.
దీనిలో ఇంధన వినియోగ ట్రాకర్, నిర్వహణ సూచనలు, చివరి పార్కింగ్ లొకేషన్, మాల్ ఫంక్షన్ నోటిఫికేషన్, రైడర్ ర్యాంకింగ్ సహా మరెన్నో ఫీచర్స్ ఈ వెర్షన్ లో ఉన్నాయి.
వీటితో పాటు 2023 శ్రేణి యమహా 125 హైబ్రిడ్ స్కూటర్లు సరికొత్త రంగులతో వచ్చి.. కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి.
కాల్ ఆఫ్ ద బ్లూ బ్రాండ్ ప్రచారం కింద తమ వినియోగదారులకు అసాధారణ అనుభవాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు
యమహా మోటర్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఐషిన్ చిహానా చెప్పారు.
భారతదేశంలో స్కూటర్ విభాగంలో పోటీ ఎక్కువగా ఉందని, దీంతో వినియోగదారుల అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని ఆయన అన్నారు.
2023 వెర్షన్ 125సీసీ హైబ్రిడ్ స్కూటర్ శ్రేణితో అత్యున్నత అనుభవాలను అందించగలమనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
భారతీయ వినియోగదారుల అంచనాలకు తగ్గట్టు సరికొత్త ఫీచర్లు, రంగులతో అందుకోగలమని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.
2023 ఫాసినో 125 ఫై హైబ్రీడ్ ఎక్స్‌షోరూం ధర రూ. 91,030గా ఉంది.
రేయ్ జెడ్ఆర్ 125 ఫై హైబ్రీడ్ ఎక్స్‌షోరూం ధర రూ. 89,530గా ఉంది.
ఇక రేయ్ జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఫై హైబ్రీడ్ ఎక్స్‌షోరూం ధర రూ. 93,530గా ఉంది.
ఈ మోడల్స్ అన్ని కూడా ఈ20 ఫ్యూయెల్ కంప్లైంట్ ఇంజిన్‌తో వస్తున్నాయి.