Valentine’s Day Offers: వాలెంటైన్స్ డే వస్తుందంటే ఈ-కామర్స్ వెబ్‌సైట్లకు మంచి గిరాకీ ఉంటుంది.
వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం కామన్. అయితే ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు అనేక సంస్థలు ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి.
ఈ ప్రేమికుల దినోత్సవానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, యాపిల్ ఐస్టోర్,అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చాయి.
ఈ ప్లాట్‌ఫామ్‌లు యాపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి.
ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలపై భారీ తగ్గింపు (Valentine’s Day Offers)
వాలెంటైన్స్ డే సందర్భంగా ఐఫోన్ 14 ( Iphone 14) సిరీస్ ఫోన్లలపై భారీ తగ్గింపు లభిస్తోంది. రూ. 12,195 ల తగ్గింపుతో పాటు హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కార్డ్ తో ఇన్ స్టాంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
ఐఫోన్ 14 పై 6 వేలు, ఐఫోన్ 14 ప్లస్ పై 7 వేల దాకా ఇన్ స్టాంట్ డిస్కౌంట్ లభిస్తోంది. గత సెప్టెంబర్ లో ఐఫోన్ 14 లాంచింగ్ ధర రూ. 79,900 కాగా.. ఇపుడు రూ. 67,705 లకు లభిస్తోంది.
ఐ ఫోన్ 14 ప్లస్ లాంచింగ్ ధర రూ. 89,900 కాగా.. ప్రస్తుతం 84,900 లకు అందుబాటులో ఉంది.
అదేవిధంగా ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ పై కూడా ఆఫర్స్ ఉన్నాయి. రూ. 129,900 వద్ద లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో ను ఈ సేల్ లో రూ. 125,400 లకు సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ. 139,900 లు కాగా.. 135,400 లకే లభిస్తోంది.
కాగా ఈ వాలంటైన్ సేల్ లో ఒక్క ఐఫోన్ పైనే కాకుండా అనేక బ్రాండ్ లు తమ ఉత్పత్తులపై పలు ఆఫర్స్ ఉన్నాయి.
ఆయా ఇ కామర్స్ వెబ్ సైట్లలో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సేల్ ఫిబ్రవరి 28 వరకు అందుబాటులో ఉంటుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/