Two Wheeler Sales: మే నెలలో ఎక్కువగా అమ్ముడుపోయిన టూ వీలర్స్ ఏవంటే?

భారత మార్కెట్ లో టూ వీలర్ అమ్మకాల్లో 2023, మే నెలలో 17 శాతం వృద్ధి నమోదైంది. ఓవరాల్ గా మే నెలలో 14.71 లక్షల యూనిట్ల టూ వీలర్ వాహనాల విక్రయాలు జరిగాయి. అదే గత ఏడాది మే నెలలో 12.53 లక్షలు వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.

Two Wheeler Sales: భారత మార్కెట్ లో టూ వీలర్ అమ్మకాల్లో 2023, మే నెలలో 17 శాతం వృద్ధి నమోదైంది. ఓవరాల్ గా మే నెలలో 14.71 లక్షల యూనిట్ల టూ వీలర్ వాహనాల విక్రయాలు జరిగాయి. అదే గత ఏడాది మే నెలలో 12.53 లక్షలు వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాల్లో హీరో మోటోకార్ప్‌, హోండా, టీవీఎస్‌, బజాజ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాలు ఎక్కువగా ఉన్నాయి.

 

టాప్ 5 లో అమ్మకాలు (Two Wheeler Sales)

టూ వీలర్ వాహన విక్రయాల్లో హీరో మోటోకార్ప్‌ కంపెనీ టాప్ లో ఉంది. గత నెలలో హీరో మోటోకార్ప్‌ 5,08,309 వాహనాలను విక్రయించింది. ఈ సంస్థ 8.90% వృద్ధిని నమోదు చేసింది.

 

హోండా కంపెనీ 2023 మే నెలలో 3,11,144 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత ఏడాది మే నెలలో ఈ కంపెనీ 3,20,857 వాహనాలను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే 3 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది.

టీవీఎస్‌ కంపెనీ.. మే నెలలో అమ్మకాల్లో మూడో స్థానంలో ఉంది. గత నెల 2,52,690 టూ వీలర్స్ అమ్మకాలు జరిగాయి. ఇందులో స్కూటర్లు, మోటారు సైకిళ్లు ఉన్నాయి. 2022, మే నెలలో 1,91,482 వాహనాలను మాత్రమే టీవీఎస్ విక్రయించింది. టీవీఎస్‌ అమ్మకాల్లో జూపిటర్‌, ఎన్‌టార్క్‌, అపాచీ, టీవీఎస్‌ ఎక్సెల్‌ సిరీస్‌ లాంటి మోడళ్లు ప్రధాన అమ్మకాల్లో ఉన్నాయి.

 

 

2022 మే నెలలో 96,102 వాహనాలను అమ్మిన బజాజ్‌.. ఈ ఏడాది మే నెలలో 1,94,684 వాహనాలను విక్రయించి నాల్గవ స్థానంలో నిలిచింది. బజాజ్‌ పల్సర్‌, ప్లాటినా విక్రయాలు దేశీయంగానే కాకుండా గ్లోబల్‌ మార్కెట్లలో కూడా బెస్ట్ సెల్లర్స్ గా నిలిచాయి.

దేశీయ విపణిలో 70,795 యూనిట్లను విక్రయించి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాల్లో 5 స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది మే నెలలో.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 53,525 వాహనాలను మాత్రమే విక్రయించింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బ్రాండ్‌లో క్లాసిక్‌ 350 అత్యధికంగా అమ్ముడైన వెహికల్ గా నిలిచింది.