Site icon Prime9

Summer car care: ఎండలో వాహనాలు పార్క్ చేస్తున్నారా..

Summer car care

Summer car care

Summer car care: గత పదిరోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఎండ వేడిమికి మనుషులే కాదు, మూగ జీవాలతో పాటు వాహనాలకు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వేడికి అకస్మాత్తుగా వాహనాల్లోంచి మంటలు వ్యాపించడం చాలా వరకు చూస్తూనే ఉంటాం. ఎండాకాలంలో వాహనాల్లో ప్రయాణించేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

ముఖ్యంగా ఇంజిన్‌, కరెంట్ సరఫరా అయ్యే వైర్ల లోపంతో చాలా వరకు వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. వాహనాల్లోని అంతర్గత వైరింగ్‌ ఓవర్‌హీట్‌తో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి వేసవిలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం వల్ల ఖచ్చితంగా వాహనం తీసే ముందు తనిఖీ చేసుకుని ప్రయాణాలు చేయాలి.

మంటలకు కారణాలు(Summer car care)

వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఇంజన్‌ త్వరగా వేడెక్కుతుంది.
వెహికల్స్ లో క్వాలిటీ లేని వైర్లు వాడటం వల్ల స్పార్క్స్‌ వచ్చి మంటలు వ్యాపించే అవకాశం ఉంది.
ఫాగ్‌లైట్స్‌, ఇతర డెకరేషన్‌ లైట్స్‌ తో కూడా వెహికల్ లోని ఎలక్ట్రిక్‌ వైర్లపై లోడ్‌ ఎక్కువ పడుతుంది.
పాత వాహనాలకు గ్యాస్‌ కిట్లను అమర్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు.

 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాహనాన్ని ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌ చేయించాలి.
టూ వీలర్, ఫోర్ వీలర్స్ లో నిర్ణీత కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇంజన్‌లో ఉండే ఆయిల్‌ ఫిల్టర్లను మార్చుకోవాలి.
వేసవిలో తరచూ ఇంజన్‌ ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తుండాలి.
వేసవిలో వాహనాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే అగ్ని ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రధానంగా గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ లాంటివి లీకేజీ లేకుండా చూసుకోవాలి. వాహనం దూర ప్రయాణం చేసిన తర్వాత నీడలో పార్కింగ్‌ చేయాలి
ఇంజన్‌, వైరింగ్‌ లపై ఓవర్‌ లోడ్‌ పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

 

Exit mobile version