Site icon Prime9

Simple ONE: వాహనదారుల్లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన ‘సింపుల్ వన్’ వచ్చేసింది.. దీని స్పెషాలిటీస్ ఇవే

Simple ONE

Simple ONE

Simple ONE: ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇష్టపడే వాళ్లు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ’ మార్కెట్ లోకి వచ్చేసింది. బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ ఈ స్కూటర్ ను 2021 ఆగష్టలోనే ఆవిష్కరించింది. అప్పటి నుంచి రెగ్యూలర్ అప్ డేట్స్ తో వాహన ప్రియుల్లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. వినియోగదారులకు బెస్ట్ అనుభూతిని, సురక్షితమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వడం కోసం ఎన్నో టెస్ట్ డ్రైవ్ లు నిర్వహించి.. మార్కెట్ లోకి విడుదల చేసినట్టు కంపెనీ పేర్కొంది.

సింపుల్ వన్ స్కూటర్‌ ప్రత్యేకతలు(Simple ONE)

బెస్ట్ స్మార్ట్‌, సుదీర్ఘ దూరం, ఫాస్ట్‌ టెక్నాలజీ, డ్యుయల్‌ బ్యాటరీ సింపుల్ వన్ స్కూటర్‌ ప్రత్యేకతలని కంపెనీ వెల్లడించింది. IP67 రేటింగ్‌తో 5kWh లిథియం ఐయాన్‌ డ్యుయల్‌ బ్యాటరీ ప్యాక్‌ను ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ వెహికల్ కోసం 95 శాతం దేశీయ ఎక్యుప్ మెంట్ ను వాడినట్టు తెలిపింది.

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌.. 7 అంగుళాల డిజిటల్‌ డిస్‌ప్లేను సింపుల్‌ వన్‌ లో ఇచ్చారు. నావిగేషన్‌, డాక్యుమెంట్‌ స్టోరేజ్‌, బ్లూటూత్‌, బ్యాటరీ రేంజ్‌ వివరాలు, కాల్‌ అలర్ట్‌ లంటి వివరాలు డిస్ ప్లే కనిపిస్తాయి. ఒక్క నిమిషంలో 1.5 కి.మీ ప్రయాణించేందుకు కావాల్సిన ఛార్జింగ్‌ పూర్తి అవుతుంది. 5 గంటల 54 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుందని కంపెనీ పేర్కొంది. ఒక సారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 212 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కి.మీ వేగం అందుకుంటుందని సింపుల్ ఎనర్జీ వెల్లడించింది. ఈ స్కూటర్ 6 రంగుల్లో అందుబాటులో ఉంది.

ధర ఎంతంటే..

సింపుల్‌ వన్‌ స్కూటర్‌ ధర బెంగళూరు లో రూ. 1.45 లక్షల ( ఎక్స్‌ షోరూం) నుంచి ప్రారంభం అవుతుంది. 750 వాట్‌ పోర్టబుల్‌ ఛార్జర్ కావాలనుకుంటే రూ. 13 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జూన్‌ 6 నుంచి ముందుగా బెంగళూరులో డెలివరీలు ప్రారంభం అవుతాయి. తర్వాత మిగిలిన నగరాల్లో ఈ స్కూటర్లు అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది. ఈ స్కూటర్ కోసం ఇప్పటికే ఒక లక్ష యూనిట్లకు బుక్సింగ్స్ వచ్చినట్టు కంపెనీ తెలిపింది. అయితే ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటికీ రూ. 35 వేలు పెరిగిందని, అయినా బుకింగ్స్ క్యాన్సిల్ కాకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

Exit mobile version