Redmi Smart Fire TV: ప్రముఖ సంస్థ షావోమీ ఇండియా అనుబంధ సంస్థ రెడ్‌మీ మరో స్మార్ట్ టీవీని మార్కెట్ లో లాంచ్ చేసింది. రెడ్‌మీ స్మార్ట్‌ఫైర్ టీవీ 32 పేరిట ఈ టీవీని తీసుకొచ్చింది.
32 ఇంచ్ సైజులో సింగిల్ వేరియంట్‌లో వస్తున్న ఈ టీవీ ధర రూ. 13,999 గా కంపెనీ నిర్ణయించింది.
తొలిసారి అమెజాన్ ఫైర్ ఓఎస్‌తో(Redmi Smart Fire TV)
గతంలోనూ రెడ్‌మీ వినియోగదారుల కోసం పలు టీవీలను పరిచయం చేసినప్పటికీ.. అవి ఆండ్రాయిత్ టీవీ ఓఎస్‌తో వచ్చేవి.
తొలిసారి అమెజాన్ ఫైర్ ఓఎస్‌తో ఈ సరికొత్త టీవీని తీసుకొచ్చారు. అమెజాన్ ఫైర్ టీవీ స్ట్రీమింగ్ డివైజులు వాడే వినియోగదారులకు ఈ ఓఎస్ పరిచయమే.
హెచ్‌డీ క్వాలిటీతో ఈ రెడ్ మీ స్మార్ట్ టీవీ వస్తోంది.
మార్చి 21 నుంచి ఈ టీవీ అమ్మకాలు ప్రారంభం అవుతాయి. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ టీవీలు అందుబాటులో ఉండనున్నాయి.
ప్రారంభ ఆఫర్, కార్డు ఆఫర్లు తీసేస్తే.. రూ. 11,999 కే ఈ టీవీ లభిస్తోంది.
ఫైర్ టీవీ ఫీచర్స్..
ఫైర్ ఓఎస్ 7తో వస్తోన్న ఈ టీవీ (Redmi Smart Fire TV) లో అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ సహా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, యాపిల్ టీవీ లాంటి ఇతర యాప్స్‌నూ ఇందులో వినియోగించుకోవచ్చు.
అమెజాన్ యాప్ స్టోర్ ద్వారా మరిన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు. ఏపీకే ఫార్మాట్‌లో ఆండ్రాయిడ్ యాప్స్, గేమ్స్ సైతం లోడ్ చేసుకునే సదుపాయం ఉంది.
రెడ్‌మీ కొత్త టీవీలో 20 వాట్స్ స్పీకర్‌ను అమర్చారు. ఇది డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎయిర్‌ప్లే, మిరాక్యాస్ట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, AV ఇన్‌పుట్ సాకెట్స్, 3.5 mm సాకెట్ అందిస్తున్నారు.
ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈథర్‌నెట్ పోర్ట్, యాంటెనా సాకెట్ ఉన్నాయి.
1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగిన ఈ టీవీతో పాటు అలెక్సా వాయిస్ యాక్సెస్‌తో రిమోట్‌ను అందిస్తున్నారు.