Poco C55 launch: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ పోకో.. తన కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది. తన విజయవంతమైన సీ సిరీస్ లో భాగంగా( Poco C55)మరో కొత్త ఫోన్ ను విడుదల చేసింది.
ఇటీవల రూ. 30 వేల విభాగంలో Poco x5 ప్రో స్మార్ట్ ఫోన్ ను లాంచఫ్ చేసింది. ఇపుడు రూ. 10 వేల లోపు బడ్జెట్ ఉన్నవారికి మరింత చౌక ఫోన్ ను ప్రకటించింది.
50 ఎంపీ కెమెరా, 10W ఫాస్ట్‌ఛార్జింగ్ సదుపాయం, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వస్తోంది. వెనుకవైపు ప్రీమియం లెదర్ తరహా స్టిచ్ డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకత.
బడ్జెట్ లో లభ్యం(Poco C55 launch)
Poco C55 సాధారణ డిజైన్‌ను కలిగి ఉంది. పాత Poco ఫోన్‌లను పోలి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. Poco C55 4G స్మార్ట్‌ఫోన్ రూ. 8,499 ధరతో వస్తోంది.
రెండు వేరియంట్లలో వస్తున్న ఈ ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధరను రూ. 9,499గా నిర్ణయించారు.
6జీబీ+128 జీబీ వేరియంట్ ధరను రూ. 10,999గా పేర్కొన్నారు. కూల్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతుంది.
ఫ్లిప్‌కార్ట్, పోకో వెబ్‌సైట్లలో ఫిబ్రవరి 28 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై పలు ఆఫర్లు ఇస్తున్నారు. బ్యాంక్ ఆఫర్ కలుపుకొంటే తొలిరోజు ఈ ఫోన్లు వెయ్యి రూపాయలు తక్కువకే లభిస్తాయి.
ఫీచర్స్ అదుర్స్
పోకో సీ55లో డ్యూయల్ నానో సిమ్ ఆప్షన్‌తో వస్తోంది. ఎంఐయూఐ 13తో పనిచేయనుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ అమర్చారు.
6.71 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్ 60Hz రీఫ్రెష్ రేటుతో వస్తోంది. ఫొటోలు, వీడియోల కోసం వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెమెరా ఇస్తున్నారు.
ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 4జీ, బ్లూటూత్ 5.1, , మైక్రో యూఎస్‌బీ పోర్ట్ అందిస్తున్నారు.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ52 రేటింగ్ కలిగి ఉంది. ఈ డివైజ్ ఒలియోఫోబిక్ కోటింగ్‌తో స్క్రాచ్-రెసిస్టెంట్ స్క్రీన్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.