Ola Electric: ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ నుంచి మరో అప్ డేట్ తీసుకొచ్చింది. కంపెనీ ఈవీల్లో MoveOS4 కు త్వరలోనే అప్ డేట్ అందించనున్నట్టు సచారం. ఈ ఓఎస్ లో కీలక మార్పులు జత చేస్తున్నట్టు సమాచారం. ఈ మార్పుల్లో కన్సర్డ్ మోడ్ ఒకటిగా ఉన్నట్టు తెలుస్తోంది. మూడవ అప్ డేట్ లో ఇచ్చిన పార్టీ మోడ్కు అడ్వాన్స్ గా దీన్ని తీసుకొస్తోంది. ఈ విషయాన్ని ఓలా కంపెనీ సీఈఏ భవీష్ అగర్వాల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
రిథమ్ కు అనుగుణంగా బ్లింక్(Ola Electric)
అందుకు సంబంధించి ఓ వీడియోను ఆయన పెట్టారు. కన్సర్ట్ మోడ్ వల్ల స్కూటర్‌లో ఉన్న లైట్లన్నీ రిథమ్ కు అనుగుణంగా బ్లింక్ అవ్వుతూ కనిపించాయి. అలా అనేక స్కూటర్లను ఒక దగ్గరకు చేర్చి కన్సర్ట్ మోడ్‌ను ఆన్ చేసి మ్యూజిక్‌ను ప్లే చేశారు. దీంతో మ్యూజిక్‌కి అనుగుణంగా లైటింగ్ బ్లింక్ అవుతుండడం ఓ స్పెషల్ ఫీలింగ్ అని భవీష్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇలాంటి ఫీచర్ ఇపుడు కొత్తేమీ కాదు. ఇదివరకే టెస్లా కార్లలో ఈ తరహా ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇటీవలే ఆస్కార్ గెలుచుకున్న తెలుగు పాట ‘నాటు నాటు’ బీట్‌కు అనుగుణంగా అమెరికాలోని ప్రవాసాంధ్రులు టెస్లా కార్లతో ఇచ్చిన లైట్ల ప్రదర్శన ఇదే ఫీచర్ వల్లే సాధ్యమైంది.
హైదరాబాద్ లో మరో మూడు
కాగా, ఓలా ఎలక్ట్రిక్ హైదరాబాద్ నగరంలో మరో 3 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను తెరవాలని నిర్ణయించిన ఓలా తాజాగా ఒకే రోజున 50 ఎక్స్ పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో మూడు సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల సంఖ్య ఏడుకు చేరింది. ఈ సెంటర్లలో S1, S1 ప్రో మోడళ్లను టెస్ట్ రైడ్ చేసే అవకాశంతో పాటు కొనుగోలుకు ఉన్న ఫైనాన్సింగ్ ఆప్షన్లు తెలుసుకోవచ్చు.