Nord CE 3 Lite: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ భారత్ మార్కెట్ లోకి మరో స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. ఇప్పటికే విడుదల అయిన నార్డ్ CE2 లైట్ కు కొనసాగింపుగా నార్డ్ CE3 లైట్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే దేశీయంగా వన్ ప్లస్ కు మంచి మార్కెట్ ఉంది. వన్ ప్లస్ CE 3 లైట్ రెండు వేరియంట్లలో వస్తోంది. ఈ సరికొత్త వెర్షన్ రూ. 20 వేల ల్లోపు రావడం మరో విశేషం.
వన్ ప్లస్ నార్డ్ CE 3 ధర, ఫీచర్లు..(Nord CE 3 Lite)
ఈ ఫోన్ లో క్వాలమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ను ఇచ్చారు. యాండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ప్యానెల్ 120Hz కి సపోర్టు అందిస్తుంది. ఫొటోలు, వీడియోల కోసం వైనుక వైపు ట్రిపుల్ కెమెరా ఇచ్చారు. ఇందులో 108 MP ప్రైమరీ కెమెరా అమర్చారు. 2 mp మ్యాక్రో కెమెరా, 2 mp డెప్త్ సెన్సర్ ఇచ్చారు. ముందు వైపు 16 mp కెమెరా తో ఈ ఫోన్ వచ్చింది. డ్యూయెల్ స్టీరియో స్పీకర్లతో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉంది.
5 వేల mah బ్యాటరీ, 67 వాట్స్ సూపర్ వైర్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ఈ ఫోన్ లో 30 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీని చార్జ్ చేయోచ్చని కంపెనీ పేర్కొంది. వైఫై, 3.5 mm జాక్ , బ్లూ టూత్ 5.1, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 5జీ, 4జీ ఎల్ టీఈ లు ఉన్నాయి. ఇక ధర విషయానికి వస్తే 8జీబీ +128 జీబీ వేరియంట్ ధర రూ. 19,999 కాగా, 8 జీబీ+254 జీబీ వేరియంట్ ధర రూ. 21,999గా కంపెనీ నిర్ణయించింది. పాస్టల్ లైమ్ , క్రోమాటిక్ గ్రే కలర్స్ ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఏప్రిల్ 11 నుంచి వన్ ప్లస్ఆన్ లైన్ స్టోర్స్, అమెజాన్, రిటైల్ స్టోర్స్ లో అమ్మకాలు ప్రారంభమవుతాయి.
మార్కెట్ లోకి నార్డ్ బడ్స్ కూడా..
వన్ ప్లస్ నార్డ్ CE 3 తోపాటు నార్డ్ బడ్స్ 2 ఇయర్ బడ్స్ ను కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేసింది కంపెనీ. వీటి ధర రూ. 9999 గా నిర్ణయించింది. నాలుగు రంగుల్లో లభ్యమయ్యే ఈ బడ్స్ ఏప్రిల్ 4 నుంచి అమ్మకాలు ప్రారంభయ్యాయి. కేవలం 10 నిమిషాలు చార్జింగ్ పెడితే 5 గంటల వరకు బడ్స ను ఉపయోగించవచ్చు.