Site icon Prime9

Noika logo: 60 ఏళ్ల తర్వాత లోగో మార్చిన నోకియా.. కొత్త లోగో ఎలా ఉందంటే

nokia logo

nokia logo

Noika logo: ఒకప్పుడు మొబైల్ రాజ్యంలో రారాజు నోకియా. అలా నీలం రంగులో అక్షరాలు ప్రత్యక్షమై, రెండు చేతులు కలిపి.. కనెక్టింగ్‌ పీపుల్‌ అనేది గుర్తొస్తుంది. ఇన్నేళ్ల తర్వాత నోకియా తన లోగోను మార్చింది. అక్షరాల డిజైన్లలో మార్పులు చేసింది.

60 ఏళ్ల నోకియా చరిత్రలో లోగో మార్చడం ఇదే తొలిసారి. సరికొత్త డిజైన్.. కొత్త ప్లాన్స్ తో కస్టమర్ల ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

తన పాపులర్ లోగో ను మార్చడం తో పాటు బిజినెస్ లో వ్యూహాన్ని కూడా మార్చి కొత్త శకానికి నాంది పలికింది.

 

కొత్త లోగో డిజైన్ ఎలా ఉందంటే..(Noika logo)

నోకియా పదాన్ని 5 వేర్వేరు ఆకృతుల కలయికతో తీసుకొచ్చింది. పాత ఐకానిక్ లోగో లో ఉన్న నీలం రంగును పూర్తిగా తీసేసి.. 5 వేర్వేరు కలర్స్ తో కొత్త లోగో రూపొందించింది.

దీని ఫలితంగా లోగో ఉపయోగించే సందర్భాన్ని బట్టి కలర్ ను ఉపయోగించనున్నారు.

ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే నోకియానే. ఆ తర్వాత వచ్చిన స్మార్ట్ ఫోన్ లతో నోకియా క్రమక్రమంగా కనుమరుగైంది. చైనా ఫోన్లు , శాంసంగ్ ధాటికి మార్కెట్ లో తట్టుకోలేకపోయింది.

అయితే చాలా కాలం తర్వాత మళ్లీ స్మార్ట్ ఫోన్ తో అభిమానులను పలకరించింది నోకియా.

 

 

వ్యూహాత్మంగా ముందుకు వెళతాం

బార్సినోలాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఈ లోగోను ఆవిష్కరించారు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్ మార్క్.

టెలికాం ఉపకరణాల తయారీలో ఇకపై మరింత వ్యూహాత్మంగా ముందుకు వెళతామని.. అందుకు తగ్గట్టు లోగోలో కొత్త ధనం తీసుకొచ్చినట్టు ప్రకటించారు.

నోకియా తన బ్రాండ్ ఐడెంటిటీని రిఫ్రెష్ చేస్తున్నట్టు తెలిపారు.

ఇకపై నోకియా కేవలం స్మార్ట్ ఫోన్ కంపెనీ మాత్రమే కాదని.. బిజినెస్ టెక్నాలజీ కంపెనీ కూడా అని ప్రకటించారు.

బిజినెస్ టూ బిజినెస్ ఇన్నోవేషన్ లీడర్ గా ఎదుగుతుందని తెలిపారు.

వ్యాపార విస్తరణల భాగంగా ఫ్యాక్టరీ ఆటోమేషన్ , డేటా సెంటర్ల ఏర్పాటు పై నోకియా ప్రధానంగా దృష్టి సారిస్తోంది.

ఈ క్రమంలో అమెజాన్ , మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకు గట్టిపోటీ ఇవ్వబోతున్నట్టు కంపెనీ తెలిపింది.

 

 

కొత్త లోగో పై భిన్నాభిప్రాయాలు

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ గా భారత్ ను పేర్కొన్న నోకియా, ప్రస్తుతం దేశంలో సంస్థకు తక్కువ మార్జిన్ ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తామని చెబుతోంది.

ఇక అమెరికాలో ఈ ఏడాది ద్వితీయార్థానికి మరింత బలపడతామని చెప్పింది నోకియా.

తాజా లోగో పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

కొంతమంది కొత్త లోగోను బాగా ఇష్టపడుతుంటే.. కొంత మంది పాతదే బాగుందని అభిప్రాయపడ్డారు.

విపరీతంగా ఆకట్టుకున్న ఐకానిక్ లోగో ను మార్చడంపై చాలామంది అసహనం వ్యక్తం చేశారు.

కాగా, నోకియా ఇటీవల రైట్ రిపేర్ లో భాగంగా కస్టమర్లు సొంతంగా రిపేర్ చేసుకునే జీ22 ఫోన్ ను పరిచయం చేసింది.

 

Exit mobile version