Mahindra XUV400 EV: భారత ప్రముఖ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు తన XUV400ఎలక్ట్రిక్ డెలివరీలు ప్రారంభించింది. మహీంద్రా నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ఇది. గుడి పడ్వా సందర్భంగా కంపెనీ మొదటి రోజే ఏకంగా 400 యూనిట్లను డెలివరీ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
వేరియంట్స్
2023 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త ఎలక్ట్రిక్ SUV ఎక్స్‌యూవీ 400 మొత్తం EC (3.2kw), EC (7.2kw), EL (7.2kw)అనే మూడు వేరియంట్లలో విడుదలైంది. వీటి ధరలు వరుసగా రూ. 15. 99 లక్షలు, రూ.16.49 లక్షలు, రూ. 18.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). మహింద్రా లో ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు కోసం జనవరిలోనే బుకింగ్స్ తీసుకుంది.
ఫీచర్లు ఇలా..(Mahindra XUV400 EV)
ఈ కారులో ప్రయాణికుల భద్రతను ద్రుష్టిలో పెట్టుకుని 6 ఎయిర్ బ్యాగులను ఇస్తున్నారు. 7 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ టచ్ స్క్రీన్ , స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ, సన్ రూఫ్ , రియర్ పార్కింగ్ కెమెరా, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ వేరియంట్లలో ఎలక్ట్రిక్ మోటార్ 100 కిలోవాట్ శక్తిని, 310 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 150 కిలో మీటర్ల వేగంతో కేవలం 8.3 సెకన్లలో 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. మొదటి దశలో దేశంలోని 34 నగరాల్లో ఈ కార్లు అందుబాటులో ఉంటాయి.
విభిన్న కలర్స్ తో
ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, ఇన్ఫినిటీ బ్లూ, నాపోలి బ్లాక్, గెలాక్సీ గ్రే వంటి 5 రంగుల్లో లభ్యమవుతుంది. అయితే ఈఎల్ వేరియంట్ లో పైన డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ ఉంది.
ఎక్స్‌యూవీ400 ఐదు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. అవి ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, కాపర్ ఫినిషింగ్ రూఫ్‌తో నాపోలి బ్లాక్ మరియు బ్లూ శాటిన్ కలర్లు ఉన్నాయి.
ఎక్స్‌యూవీ 400 రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. అవి ఒకటి 34.5kWh బ్యాటరీ కాగా, మరొకటి 39.4kWh బ్యాటరీ ప్యాక్. ఈ రెండూ 150 హెచ్‌పి, 310 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కిమీ. ఈ ఎలక్ట్రిక్ కారులోని 34.5 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్‌తో 375 కిమీ రేంజ్, 39.4 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్‌తో 456 కిమీ రేంజ్ అందిస్తుంది.
50 నిమిషాల్లో 80 శాతం చార్జ్
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఫాస్ట్ ఛార్జర్ (50kW DC)ద్వారా 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది, అదే సమయంలో 7.2kW ఛార్జర్ ద్వారా 6 గంటల 30 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. ఇక చివరగా 3.3kW AC ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి 13 గంటల సమయం పడుతుంది.