Site icon Prime9

Kia Syros: కియా నుంచి సరికొత్త కార్.. టెంప్ట్ చేస్తున్న ఫీచర్లు.. బుకింగ్స్ స్టార్ట్..!

Kia Syros

Kia Syros

Kia Syros: కియా ఇండియా దేశీయ విపణిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌యూవీ సైరోస్‌ని పరిచయం చేసింది. అయితే కియా సైరోస్‌ ధరలను ఇంకా ప్రకటించలేదు. ఫ్యూచరిస్ట్ డిజైన్, అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ ఎస్‌యూవీ 20 కంటే ఎక్కువ స్టాండర్డ్ సేఫ్టీ ఉన్నాయి. దీని బుకింగ్స్ జనవరి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 2025 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. దీని డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ఇంజిన్, పర్ఫామెన్స్ సంబంధిత వివరాలను చూద్దాం.

కియా ఈ SUVని బాక్సీ డిజైన్‌తో పరిచయం చేసింది. డిజైన్ గురించి మాట్లాడితే దీనికి ట్రిపుల్-బీమ్ వర్టికల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, L- ఆకారపు ఎల్‌ఈడీ డీఆర్ఎల్, ఫ్లష్-డోర్ హ్యాండిల్‌తో ఎలిజెంట్, మోడర్న్ ప్రొఫైల్ ఇచ్చారు. ఇది ఫ్లాట్ రూఫ్ లైన్, 17-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌తో ఎల్-ఆకారపు LED టైల్‌లైట్‌లను కూడా పొందుతుంది. సైరోస్‌ పొడవు 3995 ఎమ్ఎమ్, వెడల్పు 1800 ఎమ్ఎమ్, ఎత్తు 1665 ఎమ్ఎమ్, వీల్‌బేస్ 2550 ఎమ్ఎమ్. దీని బూట్ స్పేస్ 465 లీటర్లు.

క్యాబిన్ గురించి మాట్లాడితే దీనికి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో కూడిన 30-అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఇచ్చారు. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్, రియర్ సీట్‌లను పొందుతుంది.

ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే కియా సైరోస్ పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ గేర్ సెలెక్టర్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, లెవల్ 2 అడాస్ సూట్, పవర్డ్ డ్రైవర్ సీట్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు,ఈపీబీ, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ట్విన్ USB C పోర్ట్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, విస్తారమైన గ్లోవ్ బాక్స్ స్పేస్ ఉన్నాయి.

కియా నుండి ఈ కొత్త ఎస్‌యూవీ మొత్తం 8 కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. వీటిలో ఫ్రాస్ట్ బ్లూ, ప్యూటర్ ఆలివ్, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, గ్రావిటీ గ్రే, ఇంపీరియల్ బ్లూ, స్పార్క్లింగ్ సిల్వర్, గ్లేసియర్ వైట్ పెర్ల్ ఉన్నాయి.

కియా సైరోస్‌‌ను పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌లలో కొనచ్చు. ఇది మొదటి 1.0 లీటర్ మూడు-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది, ఇది 118 బిహెచ్‌పి పవర్, 172 ఎన్ఎమ్ పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

కాగా, రెండవ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 116 బీహెచ్‌పీ పవర్, 250 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనిని ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్లో, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా మరియు హోండా ఎలివేట్ వంటి సెగ్మెంట్‌లోని ఇతర వాహనాలతో పోటీపడుతుంది.

Exit mobile version