iQoo Z7 5G: మార్కెట్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్ ఫోన్స్ రిలీజ్ అవుతున్నాయి. వాటికి తగ్గట్టే యూజర్లు కూడా కొత్త మోడళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ (IQoo) మరో 5 జీ స్మార్ట్ ఫోన్ ను దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఐక్యూ జడ్7 5జీ (iQoo Z7 5G) పేరితో ఈ మొబైల్ లాంచ్ అయింది. ప్రత్యేకంగా భారత్ మార్కెట్ కోసం ఈ సరికొత్త మొబైల్‌ను రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. 2 స్టోరేజీ వేరియంట్స్ తో లభిస్తున్న ఈ ఫోన్ విక్రయాలు మార్చి 21 నుంచి ప్రారంభం అవుతాయి.
వివో ఐక్యూ ఫీచర్లు ఏంటో చూద్దాం..
ఐక్యూ జడ్ 7 5జీ (iQoo Z7 5G) రెండు స్టోరేజీ వేరియంట్సలో లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ. 18,999 గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+128 జీబీ వేరియంట్ ధరను రూ. 19,999 గా పేర్కొంది. బ్యాంక్ ఆఫర్‌తో ఈ మొబైల్ కొన్న వారికి బేస్ వేరియంట్ రూ. 17,499లకే లభిస్తుంది. అమెజాన్, ఐక్యూ ఈ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. ఇక పోతే ఈ ఫోన్ నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్స్ లో లభ్యమవుతోంది.
ఈ ఫోన్ లో ఇందులో 6.38 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. 90 హెర్జ్ రీఫ్రెష్ రేట్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్‌తో ఔట్ ఆఫ్ ది బాక్స్ లభిస్తోంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్‌సిటీ 920 ప్రాసెసర్‌తో వస్తుంది. వెనుక వైపు 64 ఎంపీ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుండగా.. మరొకటి 2 ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్‌ను అమర్చారు. ముందు వైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ పంచ్ హోల్ కెమెరా ఇస్తున్నారు. వెనుక వైపు కెమెరాతో 4కె వీడియోలను రికార్డు చేసుకునే వీలు ఉంది. ఇంటర్నల్ స్టోరేజీని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 44W ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వైఫై 6, బ్లూ టూత్ 5.2, 3.5 ఎంఎం జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ కలిగిన ఈ ఫోన్ ప్లాస్టిక్ బాడీతో వస్తోంది. రూ.20 వేల లోపు 5జీ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్..