Site icon Prime9

Hero MotoCorp: హీరో మోటోకార్ప్‌ నుంచి సరికొత్త హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌

Hero MotoCorp

Hero MotoCorp

Hero MotoCorp: ప్రముఖ టూ వీలర్ సంస్థ హీరో మోటోకార్ప్‌ నుంచి సరికొత్త హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ భారత మార్కెట్ లో లాంచ్‌ అయింది. మెరుగైన ఫీచర్లతో ఈ బైక్‌ను కంపెనీ తీసుకొచ్చింది. కొత్తగా లాంచ్ అయిన హెచ్ ఎఫ్ డీలక్స్ కిక్‌ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 60,760 నుంచి ప్రారంభమవుతోంది. అదే విధంగా సెల్ఫ్‌ స్టార్ట్‌ వేరియంట్‌ ధర రూ. 66,408 నుంచి మొదలుకానుంది. దేశ వ్యాప్తంగా అన్ని హీరో మోటోకార్ప్ షోరూమ్ ల్లో కొత్తగా లాంచ్ అయిన వేరియంట్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

 

బ్లాక్ లవర్స్ కోసం(Hero MotoCorp)

ఈ కొత్త హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ నాలుగు రంగులు.. బైక్‌ నెక్సస్‌ బ్లూ, క్యాండీ బ్లేజింగ్‌ రెడ్‌, హెవీ గ్రే విత్ బ్లాక్‌, బ్లాక్‌ విత్‌ స్పోర్స్ట్‌ రెడ్‌ లో లభిస్తోంది. ఈ నాలుగు రంగులతో పాటు కాన్వాస్‌ బ్లాక్‌ పేరిట కొత్త ఎడిషన్‌ ను కూడా హీరో మోటో కార్ప్ రిలీజ్ చేసింది. కాగా కాన్వాస్‌ ఎడిషన్‌ బైక్‌ కంప్లీట్ గా బ్లాక్ థీమ్‌తో వస్తోంది. ఇంజిన్, ఫ్యూయల్‌ ట్యాంక్‌, వీల్స్‌.. అన్నీ బ్లాక్ లోనే ఉంటాయి. కేవలం బ్లాక్ లవర్స్ కోసం ఈ ఎడిషన్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది.

Hero MotoCorp launches HF Deluxe Canvas Black at Rs. 60,760

హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ ఫీచర్లు

ఈ కొత్త వేరియంట్ తో సెల్ఫ్, సెల్ఫ్‌ ఐ3ఎస్‌ మోడల్స్ ట్యూబ్‌లెస్‌ టైర్లతో వస్తున్నాయి. ఇందులో USB ఛార్జర్‌ సదుపాయం ఉంది. అయితే, ఇది కేవలం వినియోగదారుడి ఆప్షన్‌. సైడ్‌ స్టాండ్‌ ఇంజిన్‌ కటాఫ్‌, కటాఫ్‌ ఎట్‌ ఫాల్‌ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ముందూ వెనుక డ్రమ్‌ బ్రేక్స్‌ అమర్చారు. ఈ బైక్ లో 97.2 సీసీ ఎయిర్‌కూల్డ్‌ సింగిల్‌ ఇంజిన్‌ సిలిండర్‌ను అమర్చారు. ఇది 9 PS పవర్‌ను, 8 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ అమర్చారు. 9.6 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌, 165 mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో ఈ బైక్‌ వస్తోంది. హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ బరువు 110 నుంచి 112 కిలోలు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

 

Exit mobile version
Skip to toolbar