Site icon Prime9

Fastrack Smartwatch: మార్కెట్ లో ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ FS1 స్మార్ట్‌వాచ్..

Fastrack Smartwatch

Fastrack Smartwatch

Fastrack Smartwatch: ప్రముఖ లైఫ్ స్టయిల్ బ్రాండ్ ఫాస్ట్రాక్ సరికొత్త స్మార్ట్ వాచ్ తో భారత్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఫాస్ట్రాక్ లిమిట్ లెస్ FS1 పేరుతో ఈ స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. ఈ వాచ్ లో బ్లూ టూత్ కాలింగ్ సపోర్ట్ తో పాటు అలెక్సా సపోర్టు కూడా ఉంది. యూజర్లు వాచ్ ద్వారా డైరెక్ట్ గా వాయిస్ కాల్స్ ను పొందవచ్చని కంపెనీ తెలిపింది. అదే విధంగా కాల్స్ కూడా ఆన్సర్ చేసే వీలు ఉంది.

 

ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్‌ FS1 ఫీచర్స్..(Fastrack Smartwatch)

ఈ వాచ్ ఫీచర్స్ ను పరిశీలిస్తే.. లిమిట్ లెస్ FS1 వాచ్ లో 1.95 అంగుళాల డిస్ ప్లే ఇస్తున్నారు. అడ్వాన్స్ డ్ ATS చిప్ సెట్ ద్వారా ఈ వాచ్ పనిచేయనుంది. 150 వాచ్ ఫేస్ లను ఇస్తున్నారు. ఇన్ బిల్ట్ అమెజాన్ అలెక్సా సపోర్టుతో వస్తోంది. 300 mAh బ్యాటరీ ఉన్న ఈ వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ పేర్కొంది.

 

ఆఫర్ కింద ప్రత్యేక ధర

ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్‌ FS1 వాచ్‌ ధరను రూ. 1,995 గా కంపెనీ నిర్ణయించింది. అయితే, లాంఛ్‌ ఆఫర్‌ కింద ఇస్తున్న ప్రత్యేక ధర అని ప్రకటించింది. కానీ, ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందో మాత్రం వెల్లడించలేదు. ఇక కలర్స్ విషయానికి వస్తే.. ఈ వాచ్ బ్లాక్‌, బ్లూ, పింక్‌ రంగుల్లో లభిస్తోంది.

ఏప్రిల్‌ 11 నుంచి అమెజాన్ లో అమ్మకాలు ప్రారంభం అవుతాయి. ఈ వాచ్ లో హార్ట్‌రేట్‌, నిద్రను మానిటర్ చేయడంతో పాటు పీరియడ్స్‌ ను మానిటర్‌ చేసే సెన్సర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. నడక, రన్నింగ్‌, జాగింగ్‌, స్ప్రింటింగ్‌ లాంటి 100 స్పోర్ట్స్‌ మోడల్స్‌ కూడా ఉన్నట్టు పేర్కొంది. బ్లూ టూత్‌ 5.3 కనెక్టివిటీ ఇందులో ఉంది.

 

Exit mobile version