Site icon Prime9

Domestic Passenger Vehicles: 2 శాతం పెరిగిన దేశీయ ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు

passenger vehicles

passenger vehicles

Domestic Passenger Vehicles: భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు గత నెలలో 1.87 శాతం పెరిగి 3,61,717 యూనిట్లకు చేరుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) సోమవారం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల పంపకాలు 3,55,043 యూనిట్లుగా ఉన్నాయి.

గత ఏడాదితో పోల్చితే..(Domestic Passenger Vehicles)

అదేవిధంగా, ద్విచక్ర వాహనాల విక్రయాలు గత నెలలో 17,35,199 యూనిట్ల నుంచి 17,49,794 యూనిట్లకు పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్ లో మూడు చక్రాల వాహనాల విక్రయాలు 50,626 యూనిట్లు కాగా ఈ ఏడాది అవి 74,418 యూనిట్లకు పెరిగాయి. 2022-23 రెండవ త్రైమాసికంలో 60,52,739 యూనిట్ల నుండి ప్రస్తుత త్రైమాసికంలో అమ్మకాలు 61,16,091 యూనిట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలంలో 10,26,309 యూనిట్ల నుంచి రెండో త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాల పంపకాలు స్వల్పంగా పెరిగి 10,74,189 యూనిట్లకు చేరుకున్నాయి.. వాణిజ్య వాహనాల డిస్పాచ్‌లు గత ఏడాదితో పోలిస్తే 2,31,991 యూనిట్ల నుంచి 2,47,929 యూనిట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 1,20,319 యూనిట్లతో పోలిస్తే ద్వితీయ త్రైమాసికంలో మొత్తం మూడు చక్రాల టోకు విక్రయాలు 1,95,215 యూనిట్లకు పెరిగాయి. మొత్తం ద్విచక్ర వాహనాల పంపకాలు 2023 జూలై-సెప్టెంబర్‌లో 46,73,931 యూనిట్ల నుండి 45,98,442 యూనిట్లకు తగ్గాయి.

మారుతీ సుజుకి ఇండియా (MSI), హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా (M&M), కియా మోటార్స్ ఇండియా, మరియు టయోటా కిర్లోస్కర్ మోటార్ సెప్టెంబరు నెలలో భారతదేశంలోని టాప్ ప్యాసింజర్ వాహన విక్రయదారులలో ఉన్నాయి. మారుతీ సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,50,812 యూనిట్ల పివిలను విక్రయించడంతో సెగ్మెంట్ లీడర్‌గా నిలిచింది, గత ఏడాది ఇదే కాలంలో 1,48,380 యూనిట్లు విక్రయించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా సెప్టెంబరు 2023లో 54,241 యూనిట్లు విక్రయించగా మహీంద్రా & మహీంద్రా 34,508 యూనిట్లను విక్రయించింది.

Exit mobile version