Site icon Prime9

BSNL Offers: గేమింగ్, ఎంటర్ టైన్మెంట్ కోసం బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ప్లాన్

BSNL Offers

BSNL Offers

BSNL Offers: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ యూజర్ల కోసం పలు రకాల ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తోంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్స్ రూపొందించింది బీఎస్ఎన్ఎల్. అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, గేమింగ్, ఎంటర్ టైన్మెంట్ లకు ఉపయోగపడేలా బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంటర్ టైన్మెంట్ పాటు గేమింగ్ ప్యాకేజ్ కావాలనుకునే వారికి రూ. 269 తో ప్యాకేజ్ అందిస్తోంది.

ఎంటర్ టైన్మెంట్ తో పాటు గేమింగ్(BSNL Offers)

ఈ ప్యాకేజ్ లో కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాల్స్ , రోజుకి 100 మెసేజ్ లు లభిస్తాయి. అదే విధంగా రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. ఒక వేళ డేటా పరిమితి ముగిసిన తర్వాత వేగం 40 కేబీపీఎస్ కు తగ్గుతుంది. డేటా, వాయిస్, మెసేజ్ లతో పాటు ఈ ప్యాక్ లో స్పెషల్ గా ఎంటర్ టైన్మెంట్ , గేమ్స్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. జింగ్ మ్యూజిక్, లోక్ ధన్ కంటెంట్, లిజన్ పాడ్ కాస్ట్ సర్వీసెస్ , ఈరోస్ నౌ లాంటి బెనిఫిట్స్ ఈ ప్యాకేజ్ లో ఉన్నాయి.

ఇక గేమింగ్ లో హార్డీ గేమ్స్, ఛాలెంజెస్ అరీనా మొబైల్ గేమింగ్ సర్వీస్, ఆస్ట్రోసెల్, గేమియం, గేమ్ ఆన్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ద్వారా నచ్చిన పాటను హలో ట్యూన్ గా కూడా పెట్టుకునే వీలు కల్పిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులు అందుబాటులోకి రాలేదు. అటువంటి ఏరియాల్లో 3 జీ నెట్ వర్క్ లో ఓటీటీ, గేమింగ్ ప్రయెజనాల్ని వాడుకోవచ్చు. ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు.

 

Exit mobile version