Site icon Prime9

Budget Smartphones: బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఫీచర్లేంటంటే..?

Budget smart Phones

Budget smart Phones

Budget Smartphones: ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగమైపోయింది. ఫోన్ లేదంటే ఏదో బాడీలో ఓ పార్ట్ మిస్ అయినట్టు ఫీల్ అవుతుంటారు 20దశకం ప్రజలు. ఎన్ని ఫోన్లు ఉన్నా ప్రజల వినియోగాలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకువస్తున్నాయి స్మార్ట్ ఫోన్ కంపెనీలు. దానితో ప్రజల్లో ఈ కొత్త స్మార్ట్ ఫోన్లకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోతుంది. తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు వినియోగదారులు. దానికి తోడు ఇప్పుడు దాదాపు దేశమంతా 5జీ కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ ఫోన్లన్నీ 5జీ కనెక్టివీటీతోపాటు హై రీఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో వస్తున్నాయి. మరి వాటిల్లో బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

రూ.6,999లకే పొకో సీ51

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో రిలీజ్ చేసిన పొకో సీ51 ఫోన్ కేవలం రూ.6,999లకే లభిస్తుంది. 4జీబీ రామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు మీడియా టెక్ హెలియో జీ36 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్-13 వర్షన్ మీద పని చేస్తుంది.

రియల్‌మీ నార్జో ఎన్55

చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ.. భారత్ మార్కెట్లోకి రియల్ మీ నార్జో55 తీసుకొచ్చింది. దీని ధర రూ.8,999 ఉంటది. యూనిసోక్ టీ612 ఎస్వోసీ చిప్ సెట్, 5000 ఎంఎహెచ్ కెపాసిటీ బ్యాటరీ విత్ 33 వాట్ల చార్జర్ తో వచ్చింది.

లావా యువ 2 ప్రో 

రియల్ మీ నార్జో ఎన్53 మాదిరిగానే లావా యువ2 ప్రో ఫోన్ కూడా ఐ-ఫోన్ మాదిరిగా రేర్ కెమెరా మాడ్యూల్ తో వస్తున్నది. గ్లాస్ రేర్ ప్యానెల్ కలిగి ఉంటది. 6.5 అంగుళాల హెచ్డీ + ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో వస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే రెండు రోజుల సపోర్ట్ కలిగి ఉంటది.

రియల్‌మీ సీ55 ఫోన్ 

రియల్ మీ సీ 55 ఫోన్ రూ.10,999లకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సైతం ఆపిల్ ఐ-ఫోన్ 10ప్రో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కలిగి ఉంటుంది. మీడియా టెక్ హెలియో జీ88 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి.. ఆండ్రాయిడ్-13 వర్షన్ మీద ఈ ఫోన్ పని చేస్తుంది.

రూ.6999లకు మోటో ఈ13

మోటరోలా మరో ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఫోన్ మోటో ఈ13 అత్యంత చౌక ధరకే లభిస్తుంది. 4జీ రామ్ విత్ యూనిసోక్ టీ606 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. డ్యుయల్ బాండ్ వై-ఫై సౌకర్యం కలిగి ఉంటుంది

Exit mobile version