Apple Employee Salary: భారత్ యాపిల్ స్టోర్స్ సిబ్బంది జీతాలెంతో తెలుసా?

యాపిల్ తమ స్టోర్లలో పనిచేసే సిబ్బందికి మంచి జీతంతో పాటు పలు రకాల ప్రయోజనాలను కల్పిస్తోంది. బీమా ప్రయోజనాలు, చెల్లింపు సెలవులు,

Apple Employee Salary: దిగ్గజ ఎలక్ట్రానిక్స్ యాపిల్ భారత్ లో రెండు రిటైల్ స్టోర్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ముంబై లో యాపిల్ బీకేసీ, ఢిల్లీలో యాపిల్ సాకేత్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టోర్ల ప్రారంభోత్సవానికి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హాజరయ్యారు కూడా. అయితే ముంబై, ఢిల్లీ లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లలో పనిచేసేందుకు అనుభవం ఉన్న సిబ్బందిని యాపిల్ నియమించింది. దీంతో ఇక్కడ పనిచేసే మేనేజర్లకు, సేల్స్ పర్సన్ లకు యాపిల్ భారీగా జీతాలు అందిస్తోంది. ఉన్నత విద్యావంతులైన వారిని ఈ రెండు స్టోర్స్ లో పనిచేసేందుకు ఎంపిక చేసింది యాపిల్. ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత విద్యా కోర్సులు చేసినవాళ్లు ఇక్కడ పనిచేస్తున్నారు.

 

ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో

అంతేకాకుండా సిబ్బంది లో కొంతమంది కేంబ్రిడ్జ్, గ్రిఫిత్ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చదివినవాళ్లు ఉన్నారు. యూరప్, మిడిల్ ఈస్ట్‌లోని యాపిల్ స్టోర్‌లలో పని చేస్తున్న కొంతమంది భారతీయులను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ ఉద్యోగులందరికీ రీటైల్ అనుభవం ఎంతో ఉంది.

25 భాషల్లో మాట్లాడే నైపుణ్యం(Apple Employee Salary)

యాపిల్‌ కంపెనీ ముంబై , ఢిల్లీ స్టోర్లలో దాదాపు 170 మంది సిబ్బందిని నియమించింది. వీరందరికీ గ్లోబల్ స్టాండర్డ్స్‌తో శిక్షణ ఇచ్చింది కంపెనీ. ముంబై యాపిల్ స్టోర్‌లోని ఉద్యోగులకు మొత్తం 25 భాషల్లో మాట్లాడే నైపుణ్యం ఉంది. అదే విధంగా ఢిల్లీ స్టోర్‌ లో పనిచేసే సిబ్బంది 15 భాషలు మాట్లాడగలరు. స్టోర్‌కు వచ్చే వివిధ ప్రాంతాల కస్టమర్లతో భాష సమస్య రాకుండా యాపిల్‌ జాగ్రత్త పడుతోంది. అందుకే దాదాపు అన్ని భారతీయ భాషలు మాట్లాడే సిబ్బందిని విధుల్లో నియమించింది.

జీతంతో పాటు ఎన్నో ప్రయోజనాలు

కాగా, యాపిల్ తమ స్టోర్లలో పనిచేసే సిబ్బందికి మంచి జీతంతో పాటు పలు రకాల ప్రయోజనాలను కల్పిస్తోంది. బీమా ప్రయోజనాలు, చెల్లింపు సెలవులు, స్టాక్ గ్రాంట్లు, యాపిల్‌ ఉత్పత్తులపై ఆఫర్లు, విద్య కోసం ఆర్థిక సహాయం లాంటి సదుపాయాలు కల్పిస్తోంది. భారత్ లో ఆర్గనైజ్డ్ రిటైల్ ఉద్యోగులకు రూ. 25,000 నుంచి రూ. 30,000 దాకా జీతం అందుతోంది. కానీ యాపిల్‌ లో మాత్రం తమ రిటైల్‌ ఉద్యోగులకు నెలకు 1 లక్షకు పైగా చెల్లిస్తున్నట్టు సమాచారం.