Prime9

YS Jagan Finger Ring: వైఎస్‌ జగన్ చేతికి సీఎం చంద్రబాబు ఉంగరం!

YS Jagan Wears Ring Like same Chandrababu: ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేతికి ఉన్న కొత్త ఉంగరం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ధరించిన మోడల్లోనే.. జగన్ సైతం ఉంగరం పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఆ రింగ్ పెట్టుకున్నాకే అధికారంలోకి వచ్చారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా అదే తరహా ఉంగరాన్ని జగన్‌ ధరించడం చర్చను లేవనెత్తింది. అయితే వాస్తవానికి అది రింగ్ కాదు.. హెల్త్ మానిటర్ ఎక్విఫ్‌మెంట్. దీనిలో ఉన్న మైక్రో చిప్ సాయంతో హెల్త్‌ను మానిటరింగ్ చేస్తారు.

 

ఎప్పటికప్పుడు హెల్త్‌ను మానిటరింగ్ చేసేలా జగన్‌ ఈ కొత్త రింగ్‌ను పెట్టుకున్నారు. ఇటీవల అధికారం కోల్పోవడం, కేసుల ఒత్తిడితో టెన్షన్‌లో ఉన్న జగన్.. రింగ్‌ను ధరించినట్లు తెలుస్తోంది. జగన్ పల్స్‌రేటు, బిపి, ఇతర ఆరోగ్యపరమైన అంశాలను ఈ ఉంగరం ఎనలైజ్ చేయనుంది. అందులోని డేటా ఆధారంగా వైద్యులు జగన్‌కు సలహాలు ఇవ్వనున్నారు. అయితే ఒత్తిడి తట్టుకోలేకే జగన్ ఈ రింగ్ పెట్టుకున్నారంటూ టిడిపి సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

 

Exit mobile version
Skip to toolbar