Prime9

Vazianagaram : సిక్కిం వరదల్లో విజయనగరం తహసీల్దార్.. అధికారులతో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్

Vazianagaram : సిక్కిం వరదల్లో విజయనగరం తహసీల్దార్ చిక్కుకున్నారు. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కూర్మనాథ్ 5రోజుల క్రితం గ్యాంగ్‌టక్‌కు వెళ్లాడు. గ్యాంగ్‌టక్‌ నుంచి మరో 20 కిలోమీటర్ల దూరంలోని పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు వారు వెళ్లిన మార్గం వరదతో మూసుకుపోయింది. దీంతో వారు పర్యాటక ప్రదేశంలో బస చేసిన హోటల్‌లోనే సురక్షితంగా ఉన్నారు.

 

రూట్ క్లియర్ అయిన తర్వాత మళ్లీ గ్యాంగ్‌టక్‌కు చేరుకునే అవకాశం ఉంది. అతడిని క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు చర్యలు చేపట్టారు. సిక్కిం డీజీపీ, ఇతర అధికారులతో మాట్లాడారు. తహసీల్దార్ కోసం సహాయక చర్యలు చేపట్టినట్లు సిక్కిం డీజీపీ తెలిపారు. మరోవైపు ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ సిక్కిం అధికారులతో మాట్లాడారు.

Exit mobile version
Skip to toolbar