Prime9

Kakani Govardhan Reddy: కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్‌ పొడిగింపు

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఈ నెల 11కి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. కాకాణి తరపు న్యాయవాది వాదనలను న్యాయమూర్తి విన్నారు. తమ వాదనలకి సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు, అక్రమ మైనింగ్ కేసులో ఏ-4గా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. మరో వైపు కాకాణికి కేసుల ఉచ్చు బిగుస్తోంది.

 

ముత్తుకూరులో కాకాణిపై మరో కేసు నమోదైంది. టోల్ గేట్లు ఏర్పాటు చేసి అక్రమంగా..లారీల వద్ద నగదు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. మరో వైపు సోషల్ మీడియాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై..అసభ్యకర పోస్టులు పెట్టారని మంగళగిరిలో ఇటీవల ఫిర్యాదు నమోదైంది. దీనిపై విచారణ సీఐడీ జరుపుతోంది.

 

కాకాణిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ రేపటికి న్యాయస్థానం వాయిదా వేసింది. వెంకటాచలంలో అక్రమ గ్రావెల్ తరలింపు కేసులో..బాపట్ల డీఎస్పీ ఆధ్వర్యంలో సిట్ విచారణ కొనసాగుతోంది. కాకాణికి ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

Exit mobile version
Skip to toolbar