Prime9

Srisailam: శ్రీశైలంలో కన్నుల పండువగా స్వర్ణ రథోత్సవం

Srisailam: శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోకకళ్యాణార్థం ఆదిదంపతుల స్వర్ణరథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేకువజామునే శ్రీమల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. స్వర్ణరథోత్సవంలో ఆశీనులైన శ్రీస్వామి అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు.

స్వర్ణరథాన్ని ఆలయ ఎదురుగల గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు.. నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు భక్తుల కోలాటాలు, మేళతాళాలతో వైభవంగా జరిగింది. స్వర్ణరథోత్సవంలో వందలాదిగా స్థానికులు, భక్తులు తరలివచ్చి స్వర్ణరథోత్సవం తిలకించారు. స్వర్ణరథంలో ఆశీనులైన శ్రీస్వామి అమ్మవారు ఆలయ ప్రధాన వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి మాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈ స్వర్ణరథోత్సవాన్ని నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar