Prime9

Visakha: విశాఖలో పెరుగుతున్న మిస్సింగ్ కేసులు

Visakha: విశాఖలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. మిస్సింగ్ కేసుల్లో అత్యధికం మహిళలే ఉన్నట్లు సమాచారం. జనవరినుంచి ఇప్పటివరకు 175 మిస్సింగ్ కేసులు నమోదైనట్టు సమాచారం. దీంతో మహిళల మిస్సింగ్‌పై విశాఖ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. చాకచక్యంగా 133మంది ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఇంకా 42 కేసుల్లో విచారణ కొనసాగుతుంది.

వివాహేతర సంబంధాలతోనే మాయం అవుతున్నట్టు గుర్తించారు.
వైజాగ్ పోలీసుల ప్రత్యేక చొరవతో చాలా వరకు ఆచూకీ లభ్యమయింది. నాలుగు నెలల మిస్సింగ్ కేసుల వివరాల్లో పోలీసులు భేష్ అనిపించుకున్నారు. కేసు నమోదుకు ముందే 8మందిని గుర్తించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదైన ఒక్క రోజులోనే 42మంది ఆచూకీని గుర్తించారు.

Exit mobile version
Skip to toolbar