Prime9

Rs 4.5 Crore Theft: కారులో తరలిస్తున్న రూ.4.5 కోట్ల నగదు మాయం.!

Rs 4.5 Crores Theft in Nellore: కారులో తరలిస్తున్న 4.5 కోట్ల రూపాయిల నగదు మాయమైంది. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సరిహద్దులో విజయవాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి రూ.4.5 కోట్ల సొత్తును ఢిల్లీ నుంచి చెన్నైకి కారులో డ్రైవర్‌, గుమస్తాకు ఇచ్చి పంపించారు.

 

నగదుతో ఉన్న ఆ కారు నెల్లూరు జిల్లా సరిహద్దు వద్దకు రాగానే జీపీఆర్‌ఎస్‌ సిగ్నల్‌ కట్‌ అయినట్టు గుర్తించిన వ్యాపారి.. గుమస్తా, డ్రైవర్‌కు ఫోన్‌ చేయగా ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో డబ్బు మాయమైనట్టు తెలుసుకున్న వ్యాపారి మర్రిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నెల్లూరు జిల్లా సరిహద్దులో మర్రిపాడు వద్ద జాతీయ రహదారిపై కారును గుర్తించారు. కారులో ప్రత్యేక లాకర్లను గుర్తించి వాహనాన్ని మర్రిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

Exit mobile version
Skip to toolbar