Prime9

AP Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొత్త లుక్.. .చాలా సింపుల్‌గా సెలూన్ ప్రారంభం

AP Deputy CM Pawan Kalyan Opens Salon Koniki Kannur: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త లుక్‌ కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. నిత్యం రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న ఆయన ఎప్పుడూ తెల్లటి దుస్తులు ధరించేవారు. అయితే డిప్యూటీ సీఎం ఇవాళ కొత్త లుక్‌లో కనిపించారు. కృష్ణా జిల్లా పెనమలూరులోని కానూరులో ఓ సెలూన్ షాప్‌ను ఓపెనింగ్ చేశారు.

 

కానూరు రోడ్డు అయ్యప్ప నగర్ సమీపంలో ‘సెలూన్ కొనికి’ సెలూన్‌ను ఆదివారం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్.. చాలా సింపుల్‌గా టీషర్టు, షార్టుతో వచ్చారు. ఆయనతో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు.

 

ఇదిలా ఉండగా, సెలూన్ ఓపెనింగ్‌కు పవన్ కల్యాణ్ వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ లేకుండా చర్యలు చేపట్టారు.

ఇక, సెలూన్‌ను ప్రారంభించిన అనంతరం వెళ్తున్న సమయంలో ఫ్యాన్స్ కోసమని అందరికీ హాయ్ చెబుతూ పలకరించారు. వెంటనే ఫ్యాన్స్ పవర్ స్టార్ అంటూ కేరింతలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Exit mobile version
Skip to toolbar