14 days Remand for Kakani: మాజీ మంత్రి కాకాణికి 14 రోజులు రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణి ఉన్నారు. కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. అయితే రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణిని.. నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో కాకాణిని పోలీసులు విచారించారు. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు, సుప్రీంకోర్టులను కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆశ్రయించినా.. ముందస్తు బెయిల్ మాత్రం దొరకలేదు.