Site icon Prime9

Viral Video: షాకింగ్ వీడియో.. ఒక్కసారిగా మహిళపై ఆకాశంలో నుంచి..!

Viral Video

Viral Video

Viral Video: రోడ్డు దాటుతున్నప్పుడు చాలాసార్లు ప్రమాదాల బారిన పడి, ఒక్కోసారి ప్రమాదంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అందుకే రోడ్డు దాటేటపుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. కానీ ఆకాశం నుంచి ప్రమాదం వస్తే జాగ్రత్త కూడా పనికిరాకుండా పోతుంది. సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వీధిలో నడుస్తూ ఓ మహిళ కనిపించింది.

ఆ మహిళ మరో మహిళతో మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీని తర్వాత ఆమె నెమ్మదిగా ముందుకు కదుళుతుంది. అక్కడా ఇక్కడా చూడకుండా హాయిగా రోడ్డు దాటుతోంది. వీడియో చూస్తుంటే ఆమె ఇళ్లు పక్కనే ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ, పై నుంచి ఏదైనా ప్రమాదం వస్తుందనే ఆలోచన ఆమెకు రాలేదు. వీడియో చూసిన తర్వాత మీరు నమ్మలేని ప్రమాదం ఆ మహిళకు జరిగింది.

 


ఇక అసలు విషయానికి వస్తే వీధిలోని పై అంతస్తు నుండి ఒక పెద్ద ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ మహిళపై వేగంగా పడింది. ట్యాంక్ పడిపోయిన వెంటనే మహిళ పూర్తిగా దానిలో మునిగిపోతుంది. ఈ వీడియోను చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. అితే అదృష్టవశాత్తూ ఆ మహిళ సురక్షితంగా బయటపడింది. ఆ మహిళ ఏదో తింటూ ముందుకు సాగుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టా‌గ్రామ్‌లో ashishsharma3865 అనే ఖాతా నుంచి అప్‌లోడ్ అయింది. ఇప్పుడు ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. చాలా మంది ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వీడియోకు 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 180K లైకులు, 6 వేల మందిపై కామెంట్లు చేశారు. ఈ ఘటన చూసిన తర్వాత మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Exit mobile version