Site icon Prime9

Animal Movie: రణబీర్ కపూర్ ‘యానిమల్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌.. రిలీజ్ ఎప్పుడంటే..?

ranbir Kapoor Animal movie

ranbir Kapoor Animal movie

Animal Movie: టాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ వంటి కల్ట్ క్లాసిక్ సూపర్ డూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ గా తన సత్తా చాటారు సందీప్ రెడ్డి వంగా. ఆ తరువాత అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే సందీప్ తన నెక్ట్స్ మూవీని బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి చేస్తున్నాడని గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకు తాజాగా ‘యానిమల్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో తెరకెక్కుతుందా అని బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దక్షిణాది ఆడియెన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా రీసెంట్ గా ఈ ‘యానిమల్’ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ ను షేర్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు సందీప్ రెడ్డి వంగా రెడీ అయ్యాడు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. యానిమల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిసెంబర్ 31న అర్థరాత్రి రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీంతో సందీప్ రెడ్డి ఫ్యాన్స్‌తో పాటు ఇటు రణ్‌బీర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను టి-సిరీస్ ప్రొడ్యూస్ చేస్తుండగా, పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు
సందీప్ రెడ్డి వంగా సన్నాహాలు చేస్తున్నారు. మరి యానిమల్ సినిమాతో సందీప్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచిచూడాలి.

Exit mobile version
Skip to toolbar