Jabardasth New Anchor Soumya Rao: జబర్దస్త్ కొత్త యాంకర్.. అసలు ఎవరీ సౌమ్య రావు..! kavitha b 2 years ago హైపర్ ఆది ఆటో రాం ప్రసాద్ ల పంచులకు రివర్స్ పంచులేస్తూ ఆ షోలో హైలెట్ అయ్యింది సౌమ్య రావు. తమిళంలో సన్ టీవీలో వచ్చిన రోజా సీరియల్ లో సాక్షి పాత్రలో నటించింది సౌమ్య రావు. అనసూయ ప్లేస్ లో వచ్చిన ఈ కొత్త యాంకర్ సౌమ్య రావు షోకి కొత్త కలర్ తెచ్చిందని చెప్పొచ్చు. ఈటీవీ లో శ్రీమంతుడు సీరియలో నటిస్తుంది సౌమ్య. కన్నడ తమిళ సీరియల్స్ లో నటిస్తూ తెలుగులో కూడా ఒక సీరియల్ చేస్తున్న అమ్మడిని జబర్దస్త్ కి యాంకర్ గా తీసుకొచ్చారు. తమిళ సీరియల్ నెంజాం మరప్పతల్లై లో నెగటివ్ రోల్ లో కూడా మెప్పించింది. మరి జబర్దస్త్ లో ఈ యాంకర్ వల్ల ఈ షో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఆమె టాలెంట్ గుర్తించేలా చేసింది ఈటీవీ స్పెషల్ ఎపిసోడ్. ఈమధ్యనే పండుగ సందర్భంగా టీవీ యాక్ట్రెస్ లతో జబర్దస్త్ కమెడియన్స్ షో ఒకటి చేశారు. జీ కన్నడ టీవీలో పట్టేదారి ప్రతిభ అనే సీరియల్ ద్వారా మొదటిసారి బుల్లితెర మీద సందడి చేసింది సౌమ్య.