Today Gold Price: బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందులోనూ భారతీయ స్త్రీలకు ఆభరణాలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అయితే గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో మార్పులు ఉంటున్నాయి. ఇక గత నాలుగు రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగింది. కాగా తాజాగా బంగారం ధరలు తగ్గాయి. తులంపై ఒకేసారి రూ. 110 తగ్గడం అంటే మాటల. మరి 16 మార్చి గురువారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,020గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.57,870గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,920గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం(gold price) ధరలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,870గా ఉంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870గా ఉంది.
వెండి ధర ఎలా ఉందంటే..
ఇకపోతే ఓవైపు బంగారం ధరలు తగ్గితే వెండి ధరల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 500 వరకు పెరిగింది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500, ముంబైలో రూ.69,000, ఢిల్లీలో రూ.69,000, కోల్‌కతాలో కిలో వెండి రూ.69,000, బెంగళూరులో రూ.72,500, హైదరాబాద్‌లో రూ.72,500, విశాఖ, విజయవాడలో రూ.72,500గా ఉంది.