Today Gold And Silver Price : బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర నేడు (మంగళవారం, మే 9 ) మళ్లీ పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ఏకంగా రూ. 61,750కి చేరింది. దీంతో దేశం లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ఒక్క రోజే తులంపై రూ. 120 పెరగడం గమనార్హం. ఇక వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 400 పెరిగింది. మరి దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,900గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,290 కి చేరింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,750 వద్ద కొనసాగుతోంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,750 ఉంది.
చెన్నైలో కిలో వెండి ధర రూ. 82,700
ముంబైలో రూ.78,100
ఢిల్లీలో రూ. 78,100
కోల్కతాలో కిలో వెండి రూ. 78,100
బెంగళూరులో రూ. 82,700
హైదరాబాద్లో రూ. 82,700
విజయవాడలో రూ.82,700
విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.