Today Gold And Silver Price : భారతీయ సాంప్రదాయంలో పసిడికి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉంటాయి. ఇక బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. కాగా ఈ క్రమంలో తాజాగా పసిడి ధర తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట్ల 10 గ్రామలు ధరపై ఏకంగా రూ.700 వరకు తగ్గగా, అదే 24 క్యారెట్ల బంగారంపై రూ.760 వరకు దిగి వచ్చింది. రోజురోజుకు పైపైకి పోతున్న పసిడి ఒక్కసారిగా తగ్గడం మహిళల్లో ఆనందం కలిగించే అంశమే. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండిపై రూ.550 వరకు తగ్గింది. తాజాగా మే 7వ తేదీని దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,920 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,090 వద్ద నమోదైంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.61,640 వద్ద ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,790 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.56,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,690 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,640 వద్ద కొనసాగుతోంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640 ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.82,400
ముంబైలో రూ.77,700
ఢిల్లీలో రూ.77,700
కోల్‌కతాలో కిలో వెండి రూ.77,700
బెంగళూరులో రూ.82,400
(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు..
హైదరాబాద్‌లో రూ.82,400
విజయవాడలో రూ.82,400
విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.