Xiaomi 15-Xiaomi 15 Ultra Price: చైనా స్మార్ట్‌ఫోన్ తయారి కంపెనీ షియోమి వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2025లో తన రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రదర్శించింది. గత సంవత్సరం కంపెనీ Xiaomi 15, Xiaomi 15 Ultraలను చైనీస్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రో మోడల్ గ్లోబల్ లాంచ్‌కు రెండు రోజుల ముందు ఫిబ్రవరి 27న చైనాలో విడుదల చేశారు. అయితే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో కూడా విడుదలయ్యాయి. దీనితో పాటు ఈ సిరీస్‌ను భారతదేశంలో కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వచ్చే వారం భారత మార్కెట్‌లో విడుదల కానుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Xiaomi 15, Xiaomi 15 Ultra Price
Xiaomi 15 ప్రారంభ ధర EUR 999 అంటే సుమారు రూ. 90,700. Xiaomi 15 Ultra ఈ సిరీస్‌లో అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్, దీని ధర EUR 1,499. అంటే సుమారు రూ. 1,36,100. ఈ రెండు ఫోన్‌లు మార్చి 11న భారత్‌లో విడుదల కానున్నాయి. ఈ రెండు ఫోన్‌లు ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా సేల్‌కి వస్తాయి. ఫోన్ కొనుగోలుపై మొదటి 6 నెలల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కంపెనీ అందిస్తోంది.
Xiaomi 15 Features
ఈ ఫోన్‌లో 6.36 అంగుళాల LTPO ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది, ఇది అధిక రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 3,200 నిట్‌ల వరకు ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 16GB ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో 5,240mAh శక్తివంతమైన బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 90W వైర్డు అలాగే 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 50MP మెయిన్ OIS కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32MP కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2పై పనిచేస్తుంది.
Xiaomi 15 Ultra Features
షియోమి ఈ అత్యంత ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లోని అనేక ఫీచర్లు కూడా దాని స్టాండర్డ్ మోడల్ లాగానే ఉన్నాయి. దీని అల్ట్రా మోడల్ 6.73 అంగుళాల WQHD 3D కర్వ్డ్ AMOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది అధిక రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 3,200 నిట్‌ల వరకు ఉంటుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్, 16GB RAM, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
ఫోన్‌లో 5,410mAh శక్తివంతమైన బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 90W వైర్డ్ అలాగే 80W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, ఇందులో 50MP ప్రధాన OIS కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇందులో కంపెనీ 200MP ISOCELL HP9 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా అందించింది. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32MP కెమెరా కూడా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2లో రన్ అవుతుంది.