Best Gaming Smartphones: మీరు శక్తివంతమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 30,000 వరకు మాత్రమే ఉంటే, మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో ఫ్లాగ్‌షిప్ రేంజ్ పనితీరును అందించే అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 2024 సంవత్సరంలో ప్రీమియం బిల్డ్-క్వాలిటీ, శక్తివంతమైన ప్రాసెసర్‌లతో ఈ విభాగంలో అనేక కొత్త ఫోన్‌లు ఉన్నాయి. మొబైల్ గేమింగ్‌ని ఇష్టపడే వ్యక్తులలో మీరు కూడా ఉన్నట్లయితే ఈ విభాగంలో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
Motorola Edge 50
కర్వ్డ్ డిస్‌ప్లేతో ఉన్న మోటరోలా ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 AE ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల poLED డిస్‌ప్లే ఉంది. కంపెనీ ఐదేళ్ల పాటు OS అప్‌డేట్‌లను అందించబోతోంది. దాని వెనుక ప్యానెల్‌లో 50MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. దీని 5000mAh బ్యాటరీ 68W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 27,999.
Samsung Galaxy S23 FE
దక్షిణ కొరియా బ్రాండ్ ఈ ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ చాలా శక్తివంతమైనది. మిడ్‌రేంజ్ విభాగంలో ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Galaxy AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. Exynos 2200 చిప్‌సెట్‌తో కూడిన ఫోన్ 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. బ్యాంక్ ఆఫర్ల తర్వాత మీరు Flipkart నుండి రూ. 30,000 కంటే తక్కువ ధరతో దీన్ని ఆర్డర్ చేయచ్చు.
Realme GT 6T
శక్తివంతమైన క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌తో కూడిన ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా RealmeUI 5.0ని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో కూడిన కెమెరా సెటప్ ఉంది. ఇందులో మంచి గ్రాఫిక్స్ ఉన్న గేమ్‌లను బెస్ట్ సెట్టింగ్స్‌లో ప్లే చేసుకోవచ్చు. అమెజాన్‌లో రూ.30 వేల కంటే తక్కువ ధరతో ఆర్డర్ చేయవచ్చు.
Vivo T3 Ultra
వివో స్మార్ట్‌ఫోన్ మెడిటెక్ డైమన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 12GB RAMతో పాటు 256GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో 50MP కెమెరా సెటప్ అందించారు. ఇది తక్కువ కాంతిలో కూడా మంచి ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. బ్యాంక్ ఆఫర్ల తర్వాత ఫ్లిప్‌కార్ట్ నుండి దాదాపు రూ.30 వేల ధరతో కొనుగోలు చేయచ్చు.
Poco F6
పోకో F-సిరీస్ శక్తివంతమైన ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్, 6.67-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ Android 14 ఆధారంగా HyperOSని కలిగి ఉంది. గరిష్టంగా 12GB RAMతో 512GB వరకు స్టోరేజ్ కలిగి ఉంది. 50MP కెమెరాతో Poco ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 24,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.