Samsung 500 MP Camera Phone: కెమెరా సెగ్మెంట్‌లో సామ్‌సంగ్ మరోసారి పెద్ద బ్యాంగ్ చేయబోతుంది. దక్షిణ కొరియా కంపెనీ ఇప్పటికే 200MP కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ 500MP కెమెరా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై పనిచేస్తుంది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం ఈ 500 MP సెన్సార్ వచ్చే ఏడాది అంటే 2026లో విడుదల కావచ్చు. ఈ సెన్సార్ Samsung Galaxy S26 Ultra స్మార్ట్‌ఫోన్‌లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం విడుదల కానున్న Galaxy S25 Ultraలో 200MP కెమెరా మాత్రమే ఉంటుంది. కంపెనీకి చెందిన ఈ ఫోన్ జనవరి 22న ప్రపంచ మార్కెట్లోకి రానుంది.
ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. సామ్‌సంగ్ 500MP కెమెరా సెన్సార్ వివరాలు లీక్ అయ్యాయి. ఈ 500MP కెమెరా సెన్సార్‌ను Samsung Galaxy స్మార్ట్‌ఫోన్‌లో ఇవ్వచ్చు. అలానే దక్షిణ కొరియా సంస్థ ట్రిపుల్ లేయర్ ఇమేజ్ స్టాక్డ్ సెన్సార్‌పై పని చేస్తోంది. ఈ కెమెరా సెన్సార్ Sony Exmor RS ఇమేజ్ సెన్సార్ కంటే చాలా అడ్వాన్స్‌గా ఉంటుంది.
ఈ ట్రిపుల్ లేయర్ స్టాక్ సెన్సార్ Apple PD-TR లాజిక్ కాన్ఫిగరేషన్ లాగా పనిచేస్తుందని ఓ టిప్‌స్టర్ పేర్కొన్నారు. 2026లో విడుదల కానున్న iPhone 18 సిరీస్‌లో Apple ఈ అధునాతన కెమెరా సెన్సార్‌ను ఉపయోగించవచ్చు. సామ్‌సంగ్ కెమెరా సెన్సార్ ఉపయోగించే Apple మొట్టమొదటి iPhone ఇది. ఇటీవలే విడుదల చేపిన యాపిల్ ఐఫోన్‌లో సోనీ కెమెరా సెన్సార్ ఉపయోగించారు. CMOS ఇమేజ్ సెన్సార్ అంటే CIS ఐఫోన్‌లో తీసుకురాన్నారు. Samsung ట్రిపుల్ లేయర్ ఇమేజ్ సెన్సార్ దీని కంటే మరింత అడ్వాన్స్‌గా ఉంటుంది.
గత ఏడాది జూలైలో ఆపిల్ అనలిస్ట్ మింగ్-చి-కువో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఐఫోన్ మోడల్‌ల కోసం ఆపిల్ సోనీ కెమెరా సెన్సార్‌లను సామ్‌సంగ్‌తో భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. ఈ మార్పును 2026లో విడుదల చేయనున్న iPhone 18 సిరీస్‌లో చూడచ్చు. సామ్‌సంగ్ 48MP కెమెరా సెన్సార్ 2026లో లాంచ్ కానున్న iPhone 18లో ఉంటుంది. అదే సమయంలో Samsung తన ఫ్లాగ్‌షిప్ Galaxy S సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో 500MP కెమెరా సెన్సార్‌ను ఉపయోగించవచ్చు.