Site icon Prime9

Oppo Reno 13: మిడిల్‌క్లాస్ వాళ్లకోసమే.. AI ట్రిపుల్ కెమెరాతో ఒప్పో కొత్త ఫోన్.. యూత్ పడిపోవడం ఖాయం..!

Oppo Reno 13

Oppo Reno 13

Oppo Reno 13: ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ – Oppo Reno 13ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త సిరీస్ కెమెరా ఫోకస్డ్ ఫోన్‌లు మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో రావచ్చు. కంపెనీ ఈ సిరీస్ ఫోన్‌లను నవంబర్‌లో చైనాలో విడుదల చేసింది. ఈ సిరీస్ జనవరి 2025లో ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు. ఇంతలో, Oppo 13 భారతీయ వేరియంట్ లైవ్ పిక్స్ లీక్ అయ్యాయి. ఇవి వినియోగదారుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ ఫోన్ సరికొత్త డార్క్ బ్లూ లేదా పర్పుల్ కలర్ లీక్‌లో చూడచ్చు. ఈ షేడ్ ఇండియన్ మార్కెట్‌కు ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు.

చైనాలో Oppo Reno 13 బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఫోన్ డిజైన్ గురించి మాట్లాడితే వినియోగదారులు చైనీస్, భారతీయ వేరియంట్‌ల మధ్య ఎటువంటి తేడాను చూడలేరు. Oppo Reno 13లో కంపెనీ AI ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది, ఇది రింగ్ షేప్ LED తో వస్తుంది. లీక్‌లో కనిపించిన ఫోన్  భారతీయ వేరియంట్‌లో కెమెరా ఐస్‌లాండ్ సమీపంలో గ్లో కనిపిస్తుంది, ఇది లైట్ రిఫ్లెక్షన్ వల్ల కావచ్చు. ఫోన్ వెనుక ప్యానెల్ గాజుతో తయారు చేయచ్చు. మొబైల్ ఫ్రేమ్ కూడా బలమైన లోహంతో తయారు చేసినట్లు అనిపిస్తుంది. ప్రస్తుతానికి, Oppo Reno 13  చైనీస్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

కంపెనీ ఈ ఫోన్‌లో 6.59 అంగుళాల 1.5K ఫ్లాట్ OLED డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో అందించినున్న ఈ డిస్‌ప్లే పీక్ బ్రైట్‌నెస్ రేంజ్ 1200 నిట్స్. ఫోన్ గరిష్టంగా 16GB RAM + 1TB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ప్రాసెసర్‌గా ఇది Mali-G615 MC6 GPUతో డైమెన్షన్ 8350 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా,8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను అందిస్తోంది. సెల్ఫీ కోసం మీరు ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడచ్చు. ఫోన్‌లో అందించిన బ్యాటరీ 5600mAh. ఈ బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS గురించి చెప్పాలంటే, ఈ ఫోన్ Android 15 ఆధారంగా ColorOS 15లో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో బయోమెట్రిక్ భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

Exit mobile version