OnePlus Red Rush Days Sale: యువతకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన ‘రెడ్ రష్ డేస్’ సేల్ ప్రకటించింది. మార్చి 4 నుండి మార్చి 9, 2025 వరకు జరిగే ఈ సేల్, కంపెనీకి చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లైన OnePlus 13 Series, OnePlus 12 Series , Nord CE 4 Series స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, నో-కాస్ట్ EMI ఎంపికలను అందిస్తుంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ OnePlus.in, Amazon, Reliance Digita, Cromaతో సహా అన్ని ప్రధాన ప్లాట్‌ఫామ్‌లలో కస్టమర్లు ఈ సేల్ డీల్స్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.
OnePlus 13, 13R
OnePlus రెడ్ రష్ సేల్‌లో స్నాప్‌డ్రాగన్ 8వ తరం 3 ప్రాసెసర్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, 1.5K 120Hz ProXDR డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ‘OnePlus 13’ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు ఇప్పుడు రూ. 5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్,రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందచ్చు. OnePlus 13R స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ. 2,000 ధర తగ్గింపు,రూ. 3,000 బ్యాంక్ తగ్గింపు అందుబాటులో ఉంది.
OnePlus 12, 12R
వన్‌ప్లస్ రెడ్ రష్ సేల్‌లో 5500 mAh బ్యాటరీ, అల్ట్రా-ఫాస్ట్ 100W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు ఇప్పుడు రూ. 8,000 ధర తగ్గింపు,రూ. 4,000 బ్యాంక్ తగ్గింపును పొందచ్చు. OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 10,000 తగ్గింపు, అదనంగా రూ. 3,000 బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు.
OnePlus Nord Series
వన్‌ప్లస్ రెడ్ రష్ సేల్‌లో 6.74-అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్, 5500 mAh బ్యాటరీని కలిగి ఉన్న OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 1,000 ధర తగ్గింపు,రూ. 4,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందుతున్నారు. OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ. 2,000 బ్యాంక్ తగ్గింపు,CE 4 Lite కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ. 1,000 బ్యాంక్ తగ్గింపు అందుబాటులో ఉంది.
OnePlus రెడ్ రష్ డేస్ సేల్ ఆఫర్‌లను OnePlus అధికారిక వెబ్‌సైట్, స్టోర్ యాప్, అమెజాన్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్‌తో సహా ఆఫ్‌లైన్ రిటైలర్ల నుండి పొందచ్చు. ఎంపిక చేసిన ఫోన్‌లలో కస్టమర్‌లు 24 నెలల నో కాస్ట్ EMI సౌకర్యాన్ని పొందచ్చు. ఈ సేల్ వినియోగదారులకు సరసమైన ధరలలో OnePlus స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.