Site icon Prime9

Lava Blaze 5G : ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధర తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు !

lava smart phone prime9news

lava smart phone prime9news

Lava Blaze 5G :భారతీయ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ లావా సంస్థ వారు అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మన ముందుకు తీసుకొచ్చింది.దీని ధర రూ.10వేల రేంజ్‌లోనే లావా బ్లేజ్ 5జీ స్మార్ట్ ఫోన్ మన ముందుకు రానుంది.ఇండియా మొబైల్‌ కాంగ్రెస్ 2022 ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆవిష్కరించారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ రూ.10వేలలోపు ఉండనుందని తెలిసిన సమాచారం.లావా బ్లేజ్ 5జీ స్మార్ట్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ దీపావళి సమయంలో మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలు కింద చదివి తెలుసుకుందాం.

లావా బ్లేజ్ 5జీ స్పెసిఫికేషన్లు

6.5 ఇంచుల HD+ display లావా బ్లేజ్ 5జీ ఫోన్‌ రానుంది.Screen రిఫ్రెష్ రేట్ 90Hzగా ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ రన్ అవుతుంది.ఈ స్మార్ట్ ఫోను 4gb ర్యామ్, 128gb స్టోరేజ్ ఉంటుంది.అంతే కాకుండా ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని ర్యామ్‌ను 3gb వరకు అదనంగా పొడిగించుకోవచ్చు.మైక్రో Sd కార్డ్ స్లాట్ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ అతి త్వరలో మన ముందుకు రానుంది.

ఇదీ   చదవండి :Redmi Pad: రెడ్ మీ సంస్థ వారు విడుదల చేసిన కొత్త ప్యాడ్ వివరాలు ఇవే !

Exit mobile version