iPhone 16 Offer: రిపబ్లిక్ డే సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ఈ సేల్‌కి మాన్యుమెంటల్ సెల్ అని కూడా పేరు పెట్టారు. ఈ సేల్ జనవరి 19 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 16 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఐఫోన్ 16 (128GB) ఇప్పుడు రూ. 67,999కి అందుబాటులో ఉంది, దీని అసలు ధర రూ. 79,999 నుండి పూర్తిగా రూ. 12,000 తగ్గింపు లభిస్తుంది.
ఐఫోన్ 16పై తగ్గింపు ఇంత మాత్రమే కాదు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు రూ. 3,000 అదనపు తగ్గింపును కూడా పొందచ్చు. ఈ ఆఫర్ ఐఫోన్ కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ తన ఫెస్టివల్ సేల్ సమయంలో ఉత్పత్తుల ధరలను మారుస్తూనే ఉంటుంది, కాబట్టి ఈ ఆఫర్ మొత్తం సేల్ సమయంలో అలాగే ఉంటుందా లేదా మారుతుందా అనేది ఖచ్చితంగా చెప్పలేము.
ఐఫోన్ 16 ప్రో ఇప్పుడు దాని అసలు ధర రూ. 1,19,900 కంటే రూ. 7,000 తక్కువకు అందుబాటులో ఉంది. అంటే రూ. 1,12,900. ఈ డిస్కౌంట్ వైట్ కలర్ వేరియంట్‌పై మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోండి, అయితే ఇతర కలర్ ధరలు కొంచెం ఎక్కువగా ఉండచ్చు. ఇది కాకుండా, కొన్ని బ్యాంకు కార్డులపై రూ. 5,000 అదనపు తగ్గింపు కూడా ఇస్తున్నారు, దీని వలన దాని ధర మరింత తగ్గుతుంది.
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ టాప్ మోడల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఇప్పుడు రూ. 1,37,900కి అందుబాటులో ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసే సమయానికి దీని ధర రూ.1,44,900. ఈ విధంగా, ఈ మోడల్ రూ. 7,000 తగ్గింపుతో లభిస్తుంది. ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ఈ సేల్ గొప్ప అవకాశం. తాజా iPhone కొనుగోలుపై ఆకర్షణీయమైన తగ్గింపులు, అదనపు ఆఫర్‌ల ప్రయోజనాలను పొందాలనుకునే వినియోగదారులకు ఈ అవకాశం మరింత ప్రత్యేకంగా ఉంటుంది.
తాజా ఆపిల్ ఐఫోన్ అంటే ఐఫోన్ 16 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో Bionic A18 చిప్‌సెట్ ఉంటుంది. దీనితో పాటు, హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది, ఇందులో మొదటి సెన్సార్ 48 మెగాపిక్సెల్‌లు, రెండవది 12 మెగాపిక్సెల్స్. ఇది కాకుండా సెల్ఫీ,వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది 128 GB, 256 GB+ 512 GB స్టోరేజ్‌ను కలిగి ఉంది.