Site icon Prime9

OnePlus Nord CE 4 Lite 5G: అమెజాన్ అదిరే ఆఫర్.. వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై భారీ ఆఫర్.. డిస్కౌంట్ ఎంతంటే..?

OnePlus Nord CE 4 Lite 5G

OnePlus Nord CE 4 Lite 5G: ఇండియన్ మార్కెట్లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు చాలా మంచి డిమాండ్ ఉంది. మొబైల్ ప్రియులు ఈ ఫోన్లను కొనడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ వన్‌ప్లస్ అభిమానులకు శుభవార్త అందించింది. OnePlus Nord CE 4 Lite 5G ‘పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇందులో స్టైలిష్ లుక్‌తో పాటు అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. రండి, ఈ ఫోన్ బేస్ ధర, ఆఫర్‌లు, స్పెసిఫికేషన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite 5G Highlights
వన్‌ప్లస్ నార్డ్ సిఈ 4 లైట్ 5జీ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంది. ఇందులో 6.6 అంగుళాల డిస్‌ప్లే ఉంది. 8GB + 256GB స్టోరేజ్, 5500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వన్‌ప్లస్ మొబైల్ ఆకర్షణీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది.

OnePlus Nord CE 4 Lite 5G Offers
వన్‌ప్లస్ నార్డ్ సిఈ 4 లైట్ 5జీ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999. అయితే ప్రస్తుతం అమెజాన్ దీనిపై 14 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. అంటే రూ.17,998కి ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు. ఎంచుకున్న బ్యాంక్ కార్డ్ చెల్లింపులపై 1,000. బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.16,998కి తగ్గనుంది. Amazon కాకుండా, OnePlus అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఫోన్‌ను డిస్కౌంట్స్‌తో ఆర్డర్ చేయచ్చు.

OnePlus Nord CE 4 Lite 5G Specifications
వన్‌ప్లస్ నార్డ్ సిఈ 4 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 14.0పై రన్ అవుతుంది.ఈ ఫోన్‌లో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8GB ర్యామ్‌, 8జీబీ వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో OIS. EISతో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం, ఈ ఫోన్ 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఫోన్ 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. 5W రివర్స్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉంది. ఇతర ఫీచర్స్‌లో IP54 రేట్, స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్, డ్యూయల్ నానో సిమ్ స్లాట్, 3.5mm ఆడియో జాక్‌ ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar