iPhone 16 Discount Offer: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఆఫర్ల వర్షం కురిపిస్తుంది. వరుసగా ఆఫర్లను ప్రకటిస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఐఫోన్లపై అత్యంత అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా నమ్మలేరు. ఎందుకంటే బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో ఫోన్ ధర గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ 16ని కేవలం రూ.72,400కి కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. అయితే ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.80 వేలు. మీరు ఈ మొబైల్ కొనాలనే ప్లాన్‌లో ఉంటే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
iPhone 16 Offers
ఈ మొబైల్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో రూ. 77,400 మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ఎలాంటి ఆఫర్ లేకుండానే ఫోన్ లాంచ్ ధర కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఇటువంటి ఆఫర్ ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో లేదు, ఇది ఈ డీల్‌ను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. అదే సమయంలో మీరు SBI క్రెడిట్ కార్డ్ లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీరు నేరుగా ఫోన్‌పై రూ. 5000 తగ్గింపును పొందుతారు. దీని ప్రకారం మీరు ఫోన్‌ను రూ. 72,400 కొనుగోలు చేయచ్చు. ఇది ఇప్పటివరకు ఫోన్‌లో అతి తక్కువ ధర.
ఇది మాత్రమే కాదు, అమెజాన్ ఫోన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది, ఇది ఈ కొత్త ఐఫోన్ 16 ధరను మరింత తగ్గిస్తుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.53,200 వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే, ఈ విలువ మీ పాత ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తున్నట్లయితే, మీరు రూ. 30 నుండి 40 వేల వరకు ఎక్స్ఛేంజ్ విలువను పొందచ్చు.
iPhone 16 Features
ఐఫోన్ 16లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దానికి కొత్త క్యాప్చర్ బటన్ కూడా జోడించారు. మొబైల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో A18 బయోనిక్ చిప్ ఉంది. ఇది iOS 18 అవుట్ ఆఫ్ ద బాక్స్ రన్ అవుతుంది. కెమెరా గురించి మాట్లాడితే iPhone 16 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 2x టెలిఫోటో జూమ్‌కు సపోర్ట్ ఇచ్చే 48MP ప్రైమరీ కెమెరా ఉంది. అదనంగా ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.