Site icon Prime9

Telugu Story: స్నేహం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం

telugu story prime9news

telugu story prime9news

Telugu Story: ఒక ఊరిలో బన్ను, జున్ను ఇద్దరు స్నేహితులు ఉండే వాళ్ళు. వాళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఒక రోజు ఇద్దరు అడవికి వెళ్లి అక్కడ సరదాగా గడిపి ఇంటికి వస్తున్న సమయంలో బన్ను కాలికి రాయి తగిలి కింద పడిపోతాడు. అప్పుడు బన్ను కాలికి పెద్ద గాయం అయ్యి, రక్తం కారిపోతూ ఉంటుంది. జున్ను రక్తాన్ని చూసి భయపడి పోతాడు. ఎంత ప్రయత్నించినా బన్ను నడవలేకపోయాడు. అప్పుడు జున్ను, బన్నును భుజాన వేసుకొని ఇంటికి తీసుకొచ్చి కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఆ రోజు రాత్రంతా బన్నుకు సేవలు చేస్తూ ఉంటాడు. తెల్లవారే సరికి బన్ను కొంచెం కోలుకుని జున్ను జున్ను అని పిలుస్తాడు. జున్ను పడుకొని ఉంటాడు ఎంత పిలిచిన జున్ను నిద్ర నుంచి లేవ లేదు. ఇంకా జున్ను లేవకపోయే సరికి బన్ను లేచి ఇంటి పక్కనే ఉన్న గుడికి వెళ్లి జున్ను పేరున అర్చన చేపిస్తాడు. ఎందుకంటే ఆ రోజు జున్ను పుట్టినరోజు.

ఇక మెల్లగా జున్ను లేచి బన్ను వైపు చూస్తాడు. తను ఏమో కనిపించడు. కనిపించక పోయే సరికి కంగారుగా బయటకు పరుగులు తీస్తాడు. కొంత దూరం వెళ్ళాక గుడి దగ్గర బన్ను కూర్చొని ఉంటాడు. అక్కడికి జున్ను వెళ్ళి ఏంటి బన్ను నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా, చెప్పకుండా ఇక్కడికి వచ్చేసావు. నువ్వు వచ్చే ముందు నాకు చెప్పాలిగా బన్ను అని అంటాడు. నేను ఇక్కడికి నీకోసమే వచ్చా జున్ను ఈ రోజు ప్రత్యేకత నీకు తెలీదా అని జున్నును అడుగుతాడు. అప్పుడు జున్ను నా కోసం వచ్చావా? ఎందుకు ఏమి ప్రత్యేకత ఉందని అడుగుతాడు. పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు జున్ను అని చెప్పగానే జున్ను కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మన పరిచయంలో ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందని బన్నుకు చెబుతాడు ఎందుకంటే నేను నన్ను కోల్పోయే క్షణంలో నువ్వు నాకు పరిచయం అయ్యావు. నీ పరిచయం వల్లేనేమో నేను ఇంకా ఇలా ఉన్నా అని జున్ను చెప్తాడు. అప్పుడు బన్ను నేను నీకు కాదు నువ్వు నాకు దొరికినందుకు నేను సంతోషపడాలి. నా కాలికి దెబ్బ తగిలినప్పుడు నువ్వు చూపించిన ప్రేమ నేను జీవితాంతం మర్చిపోలేను. ఈ జన్మకు మాత్రమే కాదు నేను ఎన్ని జన్మలు మనిషి పుట్టుక పుడతానో అన్ని జన్మలు నా స్నేహితునిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్తాడు.

నీతి :స్నేహం ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండాలంటే అది ఒకరికి ఒకరు ఇచ్చుకునే గౌరవం మీద నిలబడి ఉంటుంది.

Exit mobile version