Prime9

Women’s ODI World Cup 2025: 2025 మహిళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ రిలీజ్.. పాక్ తో భారత్ తలపడేది అప్పుడే!

Women’s ODI World Cup 2025

Women’s ODI World Cup 2025

Women ODI World Cup 2025: భారత దేశంలో క్రికెట్ అంటే మరో మతం. క్రికెట్ అనే మతాన్ని నిజంగానే భారత్ లో ప్రవేశ పెడితే అన్ని మతాలకన్నా ఎక్కువ జనాభా ఈ క్రికెట్ కే ఉంటుందనడంలో అతిశయోక్తి కాదేమో. తాజాగా క్రికెట్ ప్రియులకు ఒక శుభవార్త…  2025 మహిళా ప్రపంచ కప్ షెడ్యూల్ రిలీజ్ అయింది.  సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో తోలి మ్యాచ్ లో భారత్,  శ్రీలంకతో తలపడనుంది. పాకిస్తాన్ ఆడే మ్యాచులను శ్రీలంకలోని కొలంబోలో ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. మ్యాచులన్నీ బెంగళూరు, ఇండోర్, గౌహతి, విశాఖపట్నం, కొలంబోలో జరుగనున్నాయి.

 

పాకిస్తాన్ తో అక్టోబర్  5న భారత్ ఢీకొననుంది.  అయితే పాకిస్తాన్ ఆడే మ్యాచులను భారత్ లో కాకుండా కొలంబోలో ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఇందుకు పాకిస్తాన్ కూడా అంగీకరించింది.

 

ప్రపంచకప్ 2025లో మొదటి మ్యాచ్ ( అక్టోబర్ 1 మొదటి మ్యాచ్) భారత్ శ్రీలంకలు తలపడనున్నాయి.  అక్టోబర్ 5న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో భారత్ పాకిస్తాన్ తలపడతాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా అక్టోబర్ 1న  న్యూజిలాండ్ తో, అక్టోబర్ 8న పాకిస్తాన్ తో , అక్టోబర్ 22న ఇంగ్లాండ్ తో తలపడనుంది.

 

టోర్నమెంట్ లో 28లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. గ్రూప్ దశ తర్వాత మూడు నాకౌట్ మ్యాచులు జరుగనున్నాయి. ఈ మ్యాచులు బెంగళూరు, ఇండోర్, గౌహతి, విశాఖపట్నం, కొలంబోలో జరుగనున్నాయి.

 

womens-cricket-worldcup-2025 1

womens-cricket-worldcup-2025 1

 

women's cricket world cup 2025 schedule released

Exit mobile version
Skip to toolbar