Site icon Prime9

Umran Malik : గంటకు 155 కి.మీ వేగంతో… బుమ్రా రికార్డు బ్రేక్ చేసిన ఉమ్రాన్ మాలిక్

indian player umran malik create record with fastest bowling by 155 kmph

indian player umran malik create record with fastest bowling by 155 kmph

Umran Malik : 2023 సంవత్సరాన్ని టీమిండియా విజయంతో స్టార్ట్ చేసింది. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా మొదటి సారి బాధ్యతలు స్వీకరించాడు. కాగా ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా రెండు పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఉత్కంఠ బరితంగా సాగిన ఈ మ్యాచ్ లో… ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత ప్లేయర్లు సక్సెస్ అయ్యారు.

ఈ మ్యాచ్ లో ముఖ్యంగా కాశ్మీరీ సంచలనం ఉమ్రాన్ మాలిక్ రికార్డు సృష్టించాడు. గతంలో మాలిక్ మాట్లాడుతూ… కుదిరితే షోయబ్ అక్తర్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డును అధిగమిస్తా. రికార్డుల కన్నా జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం అని చెప్పాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు ఉమ్రాన్ మాలిక్ ఈ మాటలు చెప్పగా … ఇప్పుడు వాటిని నిజం చేసి చూపించాడు. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు ఈ యంగ్ బౌలర్.

శ్రీలంక కెప్టెన్ డసన్ షనక క్రీజులో పాతుకుపోయి జట్టును విజయం వైపు నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఉమ్రాన్ ఫాస్టెస్ట్ డెలివరీకి వెనుదిరగక తప్పలేదు. దీంతో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు. భారత్ తరఫున అత్యధిక వేగవంతమైన బాల్ వేసిన బౌలర్‌గా ఉమ్రాన్ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ రికార్డులను అధిగమించాడు. బుమ్రా గంటకు 153.36 కిలోమీటర్ల వేగంతో టాప్‌లో ఉండగా.. మహమ్మద్ షమీ (153.3 కిలోమీటర్లు), నవ్‌దీప్ సైనీ గంటకు 152.85 కిలోమీటర్ల వేగంతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. తాజాగా ఈ ముగ్గుర్ని వెనక్కు నెట్టి ఉమ్రాన్ టాప్‌లో నిలిచాడు.

Exit mobile version