India Vs Srilanka ODI : గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 67 పరుగుల తేడాతో శ్రీలంకను మట్టికరిపించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ విరాట్ కోహ్లీ (113), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ రాణించడంతో భారీ స్కోర్ చేయగలిగారు. టీమిండియా బౌలర్లు సమిష్టి కృషితో రాణించి శ్రీలంకను కట్టడి చేయగలిగారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. శ్రీలంక కెప్టెన్ శనక శతకం చేసి చివరి వరకు పోరాడాడు. సెంచరీతో చెలరేగి భారత జట్టు భారీస్కోరు చేయడానికి భాగస్వామి అయిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
రికార్డులు తిరగరాసిన కోహ్లీ, రోహిత్..
మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండయాకు ఓపెనర్లు రోహిత్ శర్మ 67 బంతుల్లో 83 పరుగులు (9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేశాడు.
దీంతో వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ 7500 పరుగులు పూర్తి చేశాడు.
అంతేకాక వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 7500 పరుగులు చేసిన ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు.
శుభ్‌మన్ గిల్ 60 బంతుల్లో 70 పరుగులుతో (11 ఫోర్లు) శుభారంభం అందించాడు.
స్వల్ప వ్యవధిలో వారిద్దరూ ఔటైనా విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు.
మొత్తం 87 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో కోహ్లీ 113 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ వన్డేల్లో కోహ్లీకిది 45వ సెంచరీ కావడం విశేషం.
ఈ సెంచరీతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు.
శ్రీలంకపై అత్యధిక సెంచరీలు చేసి సచిన్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.
అంతే కాకుండా లంకపై కోహ్లి ఇప్పటివరకు 9 సెంచరీలు సాధించాడు.
For his stupendous knock of 113 off 87 deliveries, @imVkohli is adjudged Player of the Match as #TeamIndia beat Sri Lanka by 67 runs.
Scorecard – https://t.co/MB6gfx9iRy #INDvSL @mastercardindia pic.twitter.com/ecI40guZuB
— BCCI (@BCCI) January 10, 2023
వీరితో పాటు శ్రేయస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోరు సాధించింది.
సెంచరీతో చివరివరకూ పోరాడిన లంక కెప్టెన్..
భారీ టార్గెట్ ని చేధించే క్రమంలో లంక బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. నాలుగో ఓవర్ ఐదో బంతికి మహ్మద్ సిరాజ్ అవిష్క ఫెర్నాండోను, ఆ తర్వాత కుసాల్ మెండిస్ ను పెవిలియన్ కు పంపించాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ పాతుమ్ నిస్సాంక, చరిత అసలంకతో కలిసి జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. అయితే అస్లాంకాను ఔట్ చేయడం ద్వారా ఉమ్రాన్ మాలిక్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఆ తర్వాత ధనంజయ డిసిల్లా (47; 40 బంతుల్లో 9 ఫోర్లు) వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. కెప్టెన్ డసున్ శనక 88 బంతుల్లో 108 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 12 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. అతడి ఒంటరి పోరాటం వృథా అయ్యింది. అవిష్క ఫెర్నాండో (5), చరిత్ అసలంక (23), హసరంగ (16), చమీక కరుణరత్నె (14) పరుగులు నిరాశపర్చడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ 2 వికెట్లు తీశాడు. షమీ, పాండ్యా, చహల్ తలో వికెట్ తీశారు. కాగా ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే గురువారం (జనవరి 12) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.
ఇవి కూడా చదవండి..
Ind vs SL: కోహ్లి సూపర్ సెంచరీ.. భారత్ భారీ స్కోర్
RRR : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”
Lokesh -Tarak: గన్నవరం బరిలో తారకరత్న?.. లోకేశ్ మాస్టర్ స్ట్రోక్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/