David Warner: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ల మధ్య 2024 లో జరిగే టీ20 వరల్డ్ కప్ ఆఖరిది కావచ్చని తన రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చాడు. స్కై సోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్ కప్ అందించి.. గర్వంగా తప్పుకుంటా
‘అంతర్జాతీయ క్రికెట్ లో 2023 చివరి సంవత్సరం కావచ్చు.. కానీ 2024 లో జరిగే టీ20 వరల్డ్ కప్ ఆడతాను. అక్కడ నా దేశానికి వరల్డ్ కప్ అందించి.. క్రికెట్ నుంచి తప్పుకుంటా’
’ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ బాష్ లీగ్ తప్ప పెద్దగా టీ20 మ్యాచులు లేవు. కాబట్టి వన్డేలు, టెస్టులపై దృష్టి పెట్టాం. అదే విధంగా వచ్చే నెలలో ఇండియాలో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రీఫ్ మా జట్టుకు కీలకం’అన్నాడు డేవిడ్
గతేడాది నుంచే రూమర్లు
వార్నర్ తన క్రికెట్ కెరీయర్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు గతేడాది రూమర్లు వచ్చాయి.
తర్వలోనే క్రికెట్లోని ఓ ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతానని వార్నర్ వ్యాఖ్యానించాడు.. దాంతో అప్పుడే రిటైర్మెంట్ పై ఊహాగానాలు ఏర్పడ్డాయి.
అదే విధంగా యూఏఈ వేదికగా 2021 టీ20 ప్రపంచ కప్ లో టోర్నీలో ఆస్ట్రేలియా ట్రోఫీని దక్కించుకుంది. అందులో 289 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’గా ఎంపికయ్యాడు.
అదేవిధంగా గతేడాది తన 100 వ టెస్టు లో దక్షిణాఫ్రికా పై డబుల్ సెంచరీ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. దాంతో విమర్శకులకు తగిన సమాధానం చెప్పాడు.
జట్టులో కీలక సభ్యుడిగా
గత దశాబ్ధ కాలంగా ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడిగా ఉంటున్న వార్నర్.. 101 టెస్టులు, 141 వన్డేలు, 99 టీ20 లు ఆడి దాదాపు 17 వేలకు పైగా పరుగులు చేశాడు.
అదే విధంగా 162 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన డేవిడ్ 5881 పరుగులు చేసి 42 సగటుతో ఉన్నాడు
ఇప్పటి వరకు 101 టెస్టు మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 46.20 సగటుతో 8,132 పరుగులు చేశాడు.
అతడు ఈ ఫార్మాట్‌లో 25 సెంచరీలు మరియు 34 అర్ధసెంచరీలు చేసిన వార్నర్ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 335(నాటౌట్).
వార్నర్ ఆసీస్ తరపున 141 ODIలు ఆడగా.. అందులో 45.16 సగటుతో 6,007 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 19 సెంచరీలు 27 అర్ధసెంచరీలు చేసిన వార్నర్ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 179.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/